గోషామహల్:  హైదరాబాద్ లోని గోషామహల్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ చోరీ జరిగింది. ఇంటికి తాళం వేసి పెళ్లికి వెళ్లిన కుటుంబాన్ని దొంగలు లక్ష్యంగా చేసుకొని చోరీకి పాల్పడ్డారు. తాళం పగలగొట్టి ఇంట్లోకి చొరబడి భారీగా బంగారం, వెండి, నగదును అపహరించారు. జైన్ స్కూల్ సమీపంలోని ఓ ఇంట్లో ఎవరూ లేని సమయంలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. బాధితుడు తన బంధువుల పెళ్లికి ఆదివారం ఉదయం వెళ్లి సాయంత్రం తిరిగి వచ్చేసరికి ఇంటి తాళం పగులగొట్టబడినట్లు గుర్తించాడు. ఇంట్లోకి వెళ్లి చూడగా సుమారు 30 తులాల బంగారం, 30 తులాల వెండి, రూ.5 లక్షల నగదు దొంగిలించినట్లు తెలిసింది. వెంటనే గోషామహల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గోశామహల్ పోలీసులు ఇంటికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనాస్థలిని పరిశీలించి క్లూస్ టీమ్ సహాయంతో ఆధారాలు సేకరిస్తున్నారు. సిసిటివి ఫుటేజీల ఆధారంగా దొంగల కోసం గాలింపు చేపట్టారు.