మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న ‘ఇరుముడి’లో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటించారు. శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం గ్లింప్స్, ట్రైలర్, పాటలతో ఇప్పటికే భారీ అంచనాలు రేకెత్తించింది. ఆగస్టు 21న థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా ప్రేక్షకులకు ఎమోషన్స్, యాక్షన్‌తో కూడిన డిఫరెంట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అనుభూతిని అందించబోతుంది.

ఈ సందర్భంగా సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. “నేను ప్రేమ కథలు, కమర్షియల్ సినిమాలు చాలా చేశాను. ఇరుముడి మాత్రం చాలా ఇంటెన్స్ థ్రిల్లర్. దర్శకుడు శివ నిర్వాణ కథ చెప్పినప్పుడే నేను అందులో లీనమైపోయాను. తెలుగు సినిమాకి ‘ఇరుముడి’ చాలా కొత్తగా ఉంటుంది. ఇందులో వచ్చే మలుపులను ప్రేక్షకులు ఊహించలేరు. ఈ సినిమాకు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చేయడానికి చాలా స్కోప్ ఉంది. మేము మా బెస్ట్ ఇచ్చాము. ఈ సినిమాకి బెస్ట్ రీజినల్ ఫిలిం, బెస్ట్ చైల్ ఆర్టిస్ట్... ఇలా చాలా జాతీయ అవార్డులు వస్తాయని నేను ఆశిస్తున్నాను. అలాగే కమర్షియల్‌గా కూడా సినిమా చాలా పెద్ద సక్సెస్ అవుతుందని నమ్ముతున్నాను. -ఈ సినిమా మ్యూజిక్ నాకు చాలా స్పెషల్. ఇందులో ప్రతిదీ సైకలాజికల్‌గా ఉంటుంది. మనం ఒకటి ఊహిస్తాము కానీ వేరే మలుపు వస్తుంది. అలాగే పాత్రలు మారే విధానం, సంఘటనలు, సన్నివేశాలు ఇవన్నీ చాలా ప్రత్యేకంగా ఉంటాయి. పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. మ్యూజిక్ విషయంలో రవితేజ చాలా హ్యాపీగా ఉన్నారు. క్లైమాక్స్‌లో చేసిన పాట ఆయనకి చాలా నచ్చింది. అది చాలా ఎమోషనల్‌గా ఉంటుంది. క్లైమాక్స్‌కి చాలా కీలకంగా ఉంటుంది. ‘మల్లెపూల పల్లకి’ అద్భుతమైన భక్తి పాట. ఇది ఒక ఐకానిక్ సాంగ్. అందుకే ఆ పాటను ఒరిజినల్ సింగర్‌తోనే పాడించాం. ఈ సినిమాలో భక్తి, సైకాలజీ, క్రైమ్, యాక్షన్, ఫ్యామిలీ సెంటిమెంట్.. ఇలా అన్ని ఎమోషన్స్ ఉన్నాయి. వాటన్నింటినీ మ్యూజికల్‌గా బ్యాలెన్స్ చేయడం జరిగింది. ఇలాంటి సినిమాకి మ్యూజిక్ చేయడం చాలా ఛాలెంజింగ్. -ఇందులో నాకు ‘యాలాలో’ పాట చాలా ఇష్టం. ఎందుకంటే ఇది ‘ఇరుముడి’కి ఆత్మ లాంటి పాట. మొత్తం ఐదు పాటలు ఉంటాయి. అవన్నీ కూడా కథలో భాగమైన పాటలు. శివ నిర్వాణ చాలా మంచి మ్యూజిక్ టేస్ట్ ఉన్న డైరెక్టర్. ఈ సినిమా మాత్రం శివ నిర్వాణ గత సినిమాలకు చాలా భిన్నంగా ఉంటుంది. చాలా సీరియస్ ఫిలిం. రవితేజ, ప్రియా భవానీ శంకర్, బేబీ నక్షత్ర, సాయికుమార్.. ఇలా ఈ సినిమాలో నటించిన అందరూ కూడా అద్భుతమైన నటనను కనబరిచారు. ఇక ప్రస్తుతం -అనిల్ రావిపూడి సినిమా చేస్తున్నాను. అలాగే దుల్కర్‌తో ‘ఆకాశంలో ఒక తార’, శ్రీ శ్రీ సినిమాలు చేస్తున్నాను. తమిళ్‌లో పా.రంజిత్‌తో ఒక సినిమా చేస్తున్నాను. -నటుడిగా ‘ఇమ్మోర్టల్’ సినిమా చేస్తున్నాను. తెలుగు, తమిళ్ రెండు భాషల్లో సెప్టెంబర్ 4న ఈ సినిమా రిలీజ్ అవుతుంది” అని అన్నారు.