అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడ జిల్లా కేంద్రంలో దారుణం జరిగింది. ఓ కానిస్టేబుల్ గొంతు కోసి హత్య చేశారు. గాంధీనగర్ సమీపంలో అర్ధరాత్రి దుండగులు ఎపిఎస్ పి కానిస్టేబుల్ నాగేశ్వరరావు(46)పై దాడి చేశారు. అనంతరం కానిస్టేబుల్ గొంతు కోసి చంపేశారు. మద్యం మత్తులో పలువురు యువకులు దాడి చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోద చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.