అమరావతి: రైఫిల్ షూటింగ్ ట్రైనర్ సాధిక్ వేధించడంతో ఎఇ కుటుంబం గోదావరి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆంధ్రప్రదేశ్‌లో రాజమహేంద్రవరంలో సంచలనం సృష్టించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... రాజమహేంద్రవరంలో పంచాయతీ రాజ్ ఎఇ నూకరాజు తన భార్య మీనా, కూతురు సౌజన్య, మనవడి కలిసి జీవించేవాడు. కాకినాడకు చెందిన రైఫిల్ షూటింగ్ ట్రైనర్ సాధిక్ వద్ద నూకరాజు మనవడు రియాన్ష్ కార్తీకేయరెడ్డి శిక్షణ తీసుకుంటున్నాడు. మీనాతో నూకరాజు పరిచయమైంది. నూకరాజు కుటుంబ సభ్యులతో కలిసి మెలిసి ఉండేవాడు. 45 రోజుల క్రితం అల్లుడు జగదీశ్వర్ రెడ్డి చనిపోవడంతో సాధిక్ ఆసరాగా తీసుకున్నాడు. అప్పటి సౌజన్యకు వేధించడంతో పాటు పలుమార్లు ఆమెపై చేయి చేసుకున్నాడు. రోజు రోజు సాధిక్ వేధింపులు ఎక్కువ కావడంతో తన కూతురు, భార్య, మనవడితో కలిసి నూకరాజు గోదావరి నదిలో ఆత్మహత్య చేసుకున్నాడు.

రియాన్ష్ కు ఈత రావడంతో మత్సకారులు అతడిని కాపాడారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నూకరాజు మృతదేహం లభ్యంకాగా మిగిలిన మృతదేహాల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. కాకినాడకు చెందిన రైఫిల్ షూటింగ్ ట్రైనర్ షేక్ సాధిక్‌ఖాన్ వేధింపులు భరించలేక తాను ఆత్మ హత్య చేసుకుంటున్నామని లేఖలో నూకరాజు పేర్కొన్నాడు. తన తల్లిపై సాధిక్ పలుమార్లు దాడి చేశాడని పోలీసులకు రియాన్ష్ కూడా తెలిపాడు. పారిపోయిన సాధిక్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. తన భర్తపై సాధిక్ విష ప్రయోగం చేసి చంపాడని భార్య సౌజన్య రాసిన లేఖలో లభ్యమవడంతో తనను మానసికంగా, శారీరకంగా వేధించాడని, వేధింపులు తట్టుకోలేక తాను ఆత్మహత్య చేసుకుంటున్నామని లేఖలో సౌజన్యం పేర్కొన్నారు. రాజమహేంద్ర వరం పోలీసులు కాకినాడలోని సాధిక్ ఇంటికి వెళ్లగా అప్పటికే అతడు పారిపోయినట్టు తెలిసింది. దీంతో అతడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. నూకరాజు, సౌజన్యతో కాల్ రికార్డులను పరిశీలిస్తే సాధిక్ కుట్రలు బయటకు వస్తాయని పోలీస్ అధికారి తెలిపారు.