మనతెలంగాణ/హైదరాబాద్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం రాత్రి కేరళం రాష్ట్రానికి బయలుదేరి వెళ్లారు. సోమవారం తిరువనంతపురంలో జరుగనున్న కేరళం నూతన ముఖ్యమంత్రి సతీశన్ ప్రమాణ స్వీకారానికి సిఎం రేవంత్‌రెడ్డి హాజరు కానున్నారు. ఆయనతో పాటు డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క వెళ్లారు. ఇదిలా ఉండగా, కేరళం అసెంబ్లీ ఎన్నికలకు ఇంఛార్జ్‌గా పనిచేసిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పలువురు ముఖ్యనేతలు సోమవారం జరిగే కేరళం సిఎం ప్రమాణ స్వీకారానికి వెళ్లనున్నట్లు పార్టీ వర్గాల సమాచారం.