
కుక్క పిల్లలకు పంది పాలు ఇచ్చిన వింత ఘటన కర్నూలు జిల్లా మంత్రాలయం లోని కోసిగి మండలం జంపాపురంలో చోటు చేసుకుంది. ఆకలితో అలమటిస్తున్న కుక్క పిల్లలు తన తల్లీ లేక పోవడంతో పంది పాలు తాగడానికి ముందుకు వచ్చినవి. అయితే పంది కూడా వాటికీ చక్కగా పాలు ఇస్తూ సహకరించడం చూసి గ్రామస్తులు అందరు ఆశ్చర్యపోయారు. సాధారణంగా కుక్కలు, పందులు ఒకదానికొకటి పడవు. కానీ, ఇక్కడ ప్రకృతి విరుద్ధంగా ఆ పంది అనాథ కుక్క పిల్లలకు ప్రేమగా పాలు ఇవ్వడం స్థానికులను, భక్తులను ఆశ్చర్యపరిచింది.













