బెంగళూరు: సంస్కృతి, సంప్రదాయాలకు పుట్టినిల్లు భారత్ అని ప్రధాని నరేంద్ర మోడీ కొనియాడారు. ఆధ్యాత్మిక, సేవాభావం ముందు వరుసలో ఉంటాయని అన్నారు. బెంగుళూరు లో మోడీ పర్యటించారు. ఆర్ట్ ఆప్ లివింగ్ 45వ వార్షికోత్సవం లో మోడీ పాల్లొన్నారు. కొత్తగా నిర్మించిన ధ్యానమందిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా బెంగళూరులో మోడీ మీడియాతో మాట్లాడారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఓ మానవతావాద సంస్థని, ఆర్ట్ ఆఫ్ లివింగ్ సేవ ప్రతిబింభిస్తుందని, దేశంలో ఆధ్యాత్మికత వెల్లివిరుస్తోందని తెలియజేశారు. సమాజశక్తి కలిస్తేనే ఎలాంటి పథకాలైనా విజయవంతం అవుతాయని, అన్ని పనుల్లో సేవ ప్రధానమైనదని మోడీ పేర్కొన్నారు. రోజువారీ జీవితంలో ఎదురయ్యే మానసిక ఒత్తిడిని జయించాలని, ధ్యానం, ప్రాణాయామంతో మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవచ్చునని సూచించారు.

ఒత్తిడి, హింస లేని సమాజ నిర్మాణానికి ఆర్ట్ ఆఫ్ లింగ్ విశేష కృషి చేసిందని, అన్నారు. సమాజం బాగుంటేనే మనమంతా సంతోషంగా ఉంటామని, సమాజ శ్రేయస్సుకు సేవ, ప్రేమ వంటి సాధనాలు ఉపకరిస్తాయని తెలిపారు. స్వచ్ఛ భారత్ అభియాన్ ఇదొక ప్రభుత్వ కార్యక్రమం కాదని అందరూ కలిసి చేయాల్సిందని, ఇతరులకు సేవ చేయడం వంటి విషయాలకు ఆర్ట్ ఆఫ్ లివింగ్ వంటి సంస్థలు తోడుగా ఉంటాయని చెప్పారు. ఉన్నత లక్ష్యాల సాధనకు ఒత్తిడి లేని ఏకాగ్రత అవసరమని, సంకల్పం స్పష్టంగా ఉండి సేవాభావంతో పనిచేస్తే విజయం తథ్యమని అన్నారు. డిజిటల్ చెల్లింపుల్లో ప్రపంచస్థాయి అగ్రగామిగా భారత్ ఎదిగిందని, ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన పేమెంట్ సిస్టమ్ గా భారత్ అవతరించిందని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు.