లూథియానా: పంజాబ్‌లోని లూథియానాలో తుపాకీ కాల్పులు కలకలం సృష్టించాయి. మంగళవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకోగా దీనికి సంబంధించిన సిసిటివి దృశ్యాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. బిఆర్ఎస్ నగర్‌లోని ఓ పిజ్జా షాపులోకి ప్రవేశించిన దుండగులు పిస్టళ్లతో కాల్పులు జరిపారు. మూడు సెకన్లలో మూడు రౌండ్లు కాల్చారు. ఈ ఘటనతో భయాందోళనకు గురైన స్థానికులు, సిబ్బంది ఒక్కసారిగా అక్కడి నుంచి పరుగు తీశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.