హైదరాబాద్: మెహదీపట్నంలో ఓ కారు బీభత్సం సృష్టించింది. అదుపు తప్పిన కారు వేగంగా వచ్చి రోడ్డుపై నడుస్తూ వెళ్తున్న మహిళను బలంగా ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన ఆ మహిళను ఆసిఫ్ నగర్ పోలీుసలసు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆమె పరిస్థతి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ప్రమాదం అనంతరం కారును అక్కడే వదిలేసి పారిపోయాడు. పోలీసులు ఆ కారును స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి డ్రైవర్‌ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.