
హైదరాబాద్: మహబూబ్‌నగర్ జిల్లాలో పాలకొండ జంక్షన్ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారును రేసింగ్ బైక్ ఢీకొట్టడంతో ఐదుగురు మృతి చెందారు. ఒకరు తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుడి పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పాలకొండ జంక్షన్ దగ్గర కారు యూ టర్న్ తీసుకుంటుండగా రేసింగ్ బైక్ 140 కిలో మీటర్ల వేగంతో కారును ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న ముగ్గురు అర్షియా బేగం(30), ఉజేప(7), అమర్(2)లు మృతి చెందారు. హైదరాబాద్ కు చెందిన యాకుబ్ అఫ్జల్ (25) తన స్నేహితుడితో కలిసి బైక్ రేసింగ్ లో పాల్గొన్నట్టు సమాచారం. బైక్ రేసింగ్ ఐదుగురి ప్రాణాలను బలి తీసుకుంది.














