
గురుకులం లో చదివి, పేదరికాన్నిజయించి నర్సుగా సే వలందిస్తున్న ఆడబిడ్డ దారుణ హత్యకు గు రికావడం తీవ్రంగా కలచివేసిందని మాజీ మంత్రి, బిఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీశ్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. హత్య అనంతరం అత్యాచారం జరిగినట్లు వస్తున్న వార్తలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పట్టపగలు హత్యలు, దోపిడీలు, అత్యాచారాల ఘటనలు రాష్ట్రంలో భద్రత డొల్లతనాన్ని బయటపెడుతుంటే.. ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు..? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అరాచకాలు పెరిగి,
శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని అన్నారు. ప్రజల ప్రాణాలకు రక్షణ లేకుండా పోతోందని ఆందోళన వ్యక్తం చేశా రు. హోం శాఖను కూడా నిర్వహిస్తున్న సిఎం రేవంత్ రెడ్డి.. రాష్ట్రంలో పరిస్థితులు ఇంత దారుణంగా మారుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. ఇంకెంత మంది ఆడబిడ్డలు బలైతే రేవంత్ ప్రభుత్వం మేల్కొంటుంది. మహిళలకు భద్రత కల్పించలేని ఆయనకు హోం శాఖ నిర్వహించే నైతిక హక్కు ఉందా..? అని నిలదీశారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి, నిందితుడికి వెంటనే శిక్ష పడేలా చేయాలని అన్నారు. రాష్ట్రంలో దిగజారుతున్న మహిళల భద్రతను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం తక్షణమే కఠిన చర్యలు చేపట్టాలని హరీశ్‌రావు బిఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేశారు.








