హైదరాబాద్: ఆదివారం ప్రపంచవ్యాప్తంగా మాతృదినోత్సవం జరుపుకుంటున్నారు. అందరు తమ తల్లికి విషెస్ చెబుతూ .. తల్లులతో సరదాగా గడుపుతున్నారు. అయితే మన మెగాస్టార్ చిరంజీవి కూడా మాతృదినోత్సవం సందర్భంగా ఎక్స్‌లో ఓ ప్రత్యేక పోస్ట్ పెట్టారు. అమ్మ మనకు మొదటి గురువు, మొదటి ధైర్యం అని చిరు పేర్కొన్నారు.

‘‘కనిపించే దైవం కూడా “కని పెంచిన” మాతృమూర్తి తర్వాతే…! మన విజయాల వెనక త్యాగం… మన ప్రతి అడుగులోనూ నిశ్శబ్దంగా నిలిచే ఆశీర్వాదం అమ్మది. మనకంటే మనల్ని ఎక్కువగా ప్రేమించే ప్రతి మాతృమూర్తికి హృదయపూర్వక మాతృదినోత్సవ శుభాకాంక్షలు’’ అని చిరు రాసుకొచ్చారు.