
రాష్ట్రంలో కొన్ని రోజులుగా భానుడు నిప్పులు చెరుగుతున్నాడు. నేటి నుంచి నాలుగు రోజులు పాటు ఉదయం ఎండ, సాయంకాలం పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతవరణ శాఖ పేర్కొంది. ఎండ తీవ్రత పలు ప్రాంతాల్లో ఒకటి నుంచి రెండు డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని వెల్లడించింది. అలాగే ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడుతాయని వివరించింది.ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, యాదాద్రి భువనగిరి, సిద్దిపేట,
జనగాం, హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, సూర్యపేట, కామారెడ్డి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నెల 27న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో ఈదురుగాలులతో కూడిన వర్షాలు ఉన్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. శనివారం గరిష్టంగా ఆదిలాబాద్లో 40.4 డిగ్రీల ఉష్ఱోగ్రతలు నమోదు కాగా ఖమ్మంలో 39.4, రామగుండం, హనుమకొండలో 39, ఆదిలాబాద్లో 37.8, హైదరాబాద్ 37.4, మెదక్లో 37 డిగ్రీలుగా ఉంది.


