
భారత్‌లో వాళ్లు ఉండొద్దు అనుకునే వాళ్లు హిందువే కాదు
దేశం అన్ని మతాలు, వర్గాలకు చెందింది సేవా కార్యక్రమాల్లో
మేం ఎవరిపట్లా వివక్ష చూపం న్యూయార్క్ మాడిసన్ స్కేర్
ప్రసంగంలో ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ వ్యాఖ్యలు
న్యూయార్క్: భారత్‌లో ముస్లింలు ఉండకూడదని భావించే వాళ్లు హిందువులే కాదని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. వాళ్లు లేకుండా హిందూ రాజ్యమే లేదు అని అన్నా రు. న్యూయార్క్‌లోని మాడిసన్ స్వేర్ గార్డెన్‌లో శనివారం జరిగిన ‘వన్ వరల్డ్: వన్ హ్యుమానిటీ ఫెయిత్ లీడర్స్ సమ్మిట్’ లో ఆయన ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో అన్ని మతాలు, వర్గాలకు చెందిన ప్రజలు కలిసి జీవిస్తున్నారని భగవత్ పేర్కొన్నారు. సంప్రదాయబద్ధంగా భారత్ అందరికీ ఆశ్రయం కల్పించిందని చెప్పారు. ప్రపంచంలో సురక్షితమైన ప్రదేశం దొరకని వారు భారత్‌కు వచ్చి ఇక్కడ తమకంటూ స్థానం ఏర్పరచుకున్నారని వివరించారు. ప్రపంచ మానవాళి అంతా ఒక్కటేనన్న జ్ఞానం తమకు ఉందని, వైవిధ్యాలు ఉన్నప్పటికీ మనమంతా ఒక్కటేననే విషయాన్ని ప్రపంచవ్యాప్తంగా అందరికీ చెప్పడం బాధ్యతగా భావిస్తున్నాం అన్నారు. ‘మీరు హిందూ సంస్థ. హిందూ రాష్ట్రం గురించి మాట్లాడుతున్నారు. మరి మా పరిస్థితి ఏమిటి? ముస్లింలమైన మమ్మల్ని దేశం నుం చి వెళ్లగొడతారా?’ అని కొందరు ముస్లిం సోదరులు తనను ప్రశ్నించారని భగవత్ తెలిపారు.
దానికి తాను లేదు.. అది హిందుత్వం కాదు. భారత్‌లో ముస్లింలు ఉండకూడదని ఏ హిందువు భావించినా, అతడు హిందువే కారని అని సమాధానం ఇచ్చినట్లు చెప్పారు. ‘నేను-నాది’ అనే భావన ఉన్నంతవరకు పరిష్కారం ఉండదు.. ‘మనం-మనది’ అనే భావనే పరిష్కారం అని భగవత్ వ్యాఖ్యానించారు. ఆర్‌ఎస్‌ఎస్ సేవా కార్యక్రమాల గురించి ప్రస్తావిస్తూ.. సేవ చేసేటప్పుడు తమ సంస్థ ఎలాంటి వివక్ష చూపదని అన్నారు. అవసరంలో ఉన్న ప్రతి ఒక్కరికీ సేవ అందిస్తున్నామని చెప్పారు. సమాజ సహకారంతో ఆర్‌ఎస్‌ఎస్ స్వయంసేవకులు దేశవ్యాప్తంగా 1.30 లక్షల సేవా ప్రాజెక్టులు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఎక్కడ సేవ అవసరమైతే అక్కడ అందరికీ సమానంగా సేవలు అందిస్తున్నామని చెప్పారు. ఆర్‌ఎస్‌ఎస్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా చేపట్టిన ప్రపంచవ్యాప్త కార్యక్రమాల్లో భాగంగా భగవత్ మంగళవారం అమెరికాకు చేరుకున్నారు. ఆయన పర్యటనలో కెనడా, బ్రిటన్ కూడా ఉన్నాయి.న్యూయార్క్‌లోని భక్తి సెంటర్‌ను కూడా భగవత్ సందర్శించారు. అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం (ఇస్కాన్) వ్యవస్థాపకుడు, భారతీయ ఆధ్యాత్మిక గురువు స్వామి ప్రభుపాదకు నివాళులర్పించారు.











