
తన సినిమాల్లో హీరో అక్కర్లేదని అంటోంది స్టార్ హీరోయిన్ సమంత. దీనికి ఆమె చెప్పే లాజిక్ కూడా సహేతుకంగా ఉంది. నేను ఎంచుకున్న సినిమాల్లో కథే హీరో. నా దృష్టిలో మొదటి స్థానం కథకే. ఆ తర్వాతే నటీనటులు. కాబట్టి నా సినిమాల్లో కథ హీరో‘ అని తన వర్షన్ వినిపించింది సమంత. అయితే అంతర్లీనంగా చూసుకుంటే, స్టార్ హీరోల సినిమాల్లో తను నటించనని, హీరోయిన్ ప్రాధాన్యం ఉన్న సినిమాల్లో మాత్రమే నటిస్తానని ఆమె చెప్పకనే చెప్పింది. ఓ మ్యాగజైన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా ఆసక్తికర విశేషాలు వెల్లడించింది సమంత. ప్రస్తుతం ఈమె 25 వాట్సాప్ గ్రూపులు మెయింటైన్ చేస్తోందట. తన రోజువారీ కార్యక్రమాలు, బిజినెస్ పనులు అన్నీ వాట్సాప్‌లోనే చూసుకొని, అందరి కంటే ముందే స్పందిస్తానని చెబుతోంది. ఇలా బిజీ లేకుండా గడిపే సమంత, ప్రతి 3 నెలలకు ఒక్కసారి కచ్చితంగా బ్రేక్ తీసుకుంటానంటోంది. ఇషా ఫౌండేషన్‌కు వెళ్లి వారం రోజులు ఏకాంతంగా గడుపుతుందంట. ఈ వారం రోజులు ఆమె ఫోన్ అస్సలు చూడదంట.















