న్యూయార్క్: ఫిఫా ప్రపంచకప్‌లో ఫ్రాన్స్, నార్వే జట్లు నాకౌట్‌కు దూసుకెళ్లాయి. ఆసక్తికరంగా సాగిన గ్రూప్‌ఐ సమరంలో నార్వే 32 గోల్స్ తేడాతో సెనెగల్‌ను ఓడించి ప్లేఆఫ్ బెర్త్‌ను సొంతం చేసుకుంది. మరో మ్యాచ్‌లో ఫ్రాన్స్ 30 తేడాతో ఇరాక్‌ను ఓడించి ముందంజ వేసింది. ఇక సెనెగల్‌తో జరిగిన మ్యాచ్‌లో నార్వేకు గట్టి పోటీ ఎదురైంది. ఇరు జట్లు ఆరంభం నుంచే నువ్వానేనా అన్నట్టు తలపడ్డాయి. ఇటు నార్వే అటు సెనెగల్ ఒకరి గోల్ పోస్ట్‌పై మరోకరు దాడులు చేస్తూ గోల్ కోసం శ్రమించాయి. కానీ చాలా సేపటి వరకు వీరి ప్రయత్నాలు ఫలించలేదు. ఇరు జట్లు పటిష్టమైన డిఫెన్స్ గోల్స్‌ను అడ్డుకున్నాయి. కానీ 43వ నిమిషంలో నార్వే తొలి గోల్ సాధించింది. మార్కస్ అద్భుత గోల్‌తో నార్వేకు ఆధిక్యం సాధించి పెట్టాడు. ఇక 45వ నిమిషంలో ఎర్లింగ్ హాలాండ్ రెండో గోల్ అందించాడు. కానీ ఇస్మాయిల్ సాధించిన గోల్‌తో సెనెగల్ నార్వే ఆధిక్యాన్ని 12కు తగ్గించింది. అయితే కొన్ని నిమిషాల వ్యవధిలోనే నార్వే ఆటగాడు ఎర్లింగ్ తన రెండో గోల్‌ను నమోదు చేశాడు. దీంతో నార్వే 31 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. తర్వాత స్కోరును సమం చేసేందుకు సెనెగల్ సర్వం ఒడ్డి పోరాడింది. ఇంజ్యురి టైమ్‌లో ఇస్మాయిల్ సెనెగల్‌కు రెండో గోల్ అందించాడు. కానీ చివరి వరకు ఆధిక్యాన్ని కాపాడుకోవడంలో సఫలమైన నార్వే జయకేతనం ఎగుర వేసి నాకౌట్‌కు చేరుకుంది.

ఇరాక్‌పై ఫ్రాన్స్ విజయం

మరో మ్యాచ్‌లో ఫ్రాన్స్ 30 గోల్స్ తేడాతో ఇరాక్‌ను చిత్తు చేసి నాకౌట్ బెర్త్‌ను సొంతం చేసుకుంది. వరుసగా రెండో విజయంతో గ్రూప్‌ఐ నుంచి ఫ్రాన్స్ రౌండ్ 32కు అర్హత సాధించింది. ఇరాక్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫ్రాన్స్ పూర్తి ఆధిపత్యం చెలాయించింది. ఆరంభం నుంచే దూకుడుగా ఆడుతూ లక్షం దిశగా సాగింది. స్టార్ ఆటగాడు కిలియన్ ఎంబాపె 14వ నిమిషంలోనే ఫ్రాన్స్‌కు తొలి గోల్ సాధించి పెట్టాడు. ఆ తర్వాత ఫ్రాన్స్ మరింత దూకుడును ప్రదర్శించింది. కానీ ఇరాక్ ఆటగాళ్లు అసాధారణ ఆటతో ఈ దాడులను సమర్థంగా అడ్డుకున్నారు. తొలి అర్ధ భాగం ముగిసే సమయానికి ఫ్రాన్స్ మరో గోల్ సాధించలేక పోయింది. కానీ 54వ నిమిషంలో ఎంబాపె ఫ్రాన్స్‌కు రెండో గోల్ అందించాడు. దీంతో ఇరాక్ పూర్తి ఆత్మరక్షణలో పడిపోయింది. ఇక 66వ నిమిషంలో ఉస్‌మానె ఫ్రాన్స్ తరఫున మూడో గోల్ నమోదు చేశాడు. చివరి వరకు ఆధిక్యాన్ని కాపాడుకోవడంలో సఫలమైన ఫ్రాన్స్ నాకౌట్‌కు దూసుకెళ్లింది.

అల్జీరియా జయకేతనం..

శాంటాకార్లా వేదికగా జోర్డాన్‌తో జరిగిన గ్రూప్‌జె మ్యాచ్‌లో అల్జీరియా 21 గోల్స్ తేడాతో జోర్డాన్‌ను ఓడించింది. ఆరంభం నుంచే పోరు హోరాహోరీగా సాగింది. ప్రారంభంలో జోర్డాన్ ఆధిపత్యం చెలాయించింది. దూకుడుగా ఆడుతూ అల్జీరియాను ఉక్కిరిబిక్కిరి చేసింది. ఇదే సమయంలో వరుస దాడులు చేస్తూ గోల్ కోసం తీవ్రంగా పోరాడింది. 36వ నిమిషంలో జోర్డాన్ శ్రమ ఫలించింది. నిజార్ అల్ రశ్‌దాన్ అద్భుత గోల్‌తో జోర్డాన్‌కు 10 ఆధిక్యం సాధించి పెట్టాడు. ఆ తర్వాత స్కోరును సమం చేసేందుకు అల్జీరియా సర్వం ఒడ్డి పోరాడింది. 69వ నిమిషంలో నధిర్ అల్జీరియాకు తొలి గోల్ అందించాడు. దీంతో స్కోరు 11తో సమమైంది. ఇక 82వ నిమిషంలో అమైన్ గోరి అల్జీరియాకు రెండో గోల్ సాధించి పెట్టాడు. ఈ ఆధిక్యాన్ని చివరి వరకు కాపాడు కోవడంలో సఫలమైన అల్జీరియా జయభేరి మోగించింది.