హైదరాబాద్: నిజామాబాద్ బాలుడి కిడ్నాప్ మిస్టరీగా మారింది. చాక్లెట్ ఇస్తానని బాలుడిని మహిళ ఎత్తుకెళ్లింది. ఆమెతో పాటు ఇంకొకరు వ్యక్తి ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. కిడ్నాప్ అయి 24 గంటలు గడిచిన బాలుడి ఆచూకీ లభించలేదు.  ఏడు బృందాలను ఏర్పాటు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాలుడి ఆచూకీ కోసం ముమ్మరంగా పోలీసులు వెతుకులాట ప్రారంభించారు. ఏదైనా ముఠా కిడ్నాప్ చేసింది? లేక పిల్లలు లేకపోవడంతో కిడ్నాప్ చేశారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాల్కొండ మండలం నాగేపూర్ గ్రామానికి చెందిన సంధ్య, నరేష్ అనే దంపతు ఇద్దరు కుమారులు ఉన్నారు. మూడో కాన్పు కోసం నిజామాబాద్‌లో జిజిహెచ్‌లో చేరారు. నరేష్ తన ఇద్దరు పిల్లలతో కలిసి టీ తాగాడు. గ్లాసులను పక్క డస్ట్ బీన్ లో వేసేందుకు ముందుకు వెళ్లాడు. ఓ మహిళ చాక్లెట్ ఇస్తానని చెప్పి వారిని అక్కడి నుంచి తీసుకెళ్లింది. మూడేళ్ల వేదాన్ష్ ఆమె వెంట వెళ్లాడు. ఐదేళ్ల నియాన్ష్ తల్లి వద్దకు వెళ్లి చెప్పడంతో ఆస్పత్రిలో వెతికారు. ఎక్కడా కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.