అల్లరి నరేష్ హీరోగా నటిస్తున్న తాజా ఎంటర్‌టైనర్ ‘రంభ ఊర్వశి మేనక’. ఈ సినిమాకి చంద్రమోహన్ చింతాడ దర్శకుడు. అన్నపూర్ణ స్టూడియోస్, హాస్య మూవీస్ సంస్థలు కలిసి రూపొందిస్తున్నాయి. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ సెప్టెంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా సోమవారం చిత్ర ట్రైలర్‌ని విడుదల చేశారు. అల్లరి నరేశ్ మార్క్ కామెడీతో ట్రైలర్ ఆద్యంతం నవ్వులు పూయిస్తోంది. ఇక ఈ సినిమాలో సురభి హీరోయిన్‌గా నటిస్తుండగా.. రాశీ సింగ్, విష్ణు ప్రియ, ప్రిషా సింగ్‌లు దేవ కన్యలుగా నటించారు. వెన్నెల కిషోర్, నరేశ్ వీకే, శ్రీనివాస్ రెడ్డి, మురళీధర్ గౌడ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.