
నందమూరి బాలకృష్ణ.. దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ‘#NBK111’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా ప్రచారంలో ఉంది. ‘వీరసింహారెడ్డిై’ విజయం తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో దీనిపై అంచనాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి. కాగా, ఆదివారం ఈ సినిమా టైటిల్‌ని ప్రకటించారు. ఈ సినిమాకి ‘దాదా’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. టైటిల్ గురించి తెలియగానే గూస్‌బంప్స్ వస్తున్నాయని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.
వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీశ్ కిలారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాజల్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుండగా.. మంచు మనోజ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ మూవీ డిసెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆదివారం ఈ విఝయాన్ని తెలియజేస్తూ చిత్ర బృందం వీడియోను పంచుకుంది.
ఇటీవల ఇదే మూవీ షూటింగ్‌లో బాలకృష్ణ గాయపడ్డారు. గాయం కారణంగా ఆయన ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. త్వరలోనే ఆయన తిరిగి సెట్స్‌లోకి అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. ముంబై నేపథ్యంలో సాగే ఈ యాక్షన్ డ్రామాలో బాలకృష్ణ మునుపెన్నడూ చూడని శక్తివంతమైన పాత్రలో కనిపించనున్నారు.











