
మన తెలంగాణ/సిటీబ్యూరో: మాజీ డీజీపీ వినయ్ రంజన్ రే భార్య తనూజ (60) హత్య కేసులో పధాన నిందితురాలైన కల్పనను హైదరాబాద్ పోలీసులు పు ణెలో అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. కల్పన గత కొన్నిరోజుల క్రితం వినయ్ రం జన్ రే ఇంట్లో పనిమనిషిగా పనిచేస్తున్నది. ఇంట్లో ఎవరూ లేని సమయం కోసం వేచిచూసిన కల్పన నేపాల్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులను రప్పించి తనూజ నోట్లో గుడ్డలు కుక్కి ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలు, నగదుతో ఉడాయించింది. ఊపిరి ఆడకపోవడంతో తనూజ మృతిచెందింది.
కేసు ను ఛాలెంజ్‌గా తీసుకున్న పోలీసులు గా లింపు చర్యలు ముమ్మరం చేశారు. అయితే, నేపాల్ ముఠాను పట్టుకునేందుకు హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ 10 బృందాలను రంగంలోకి దింపారు. ఈ బృందాలు నేపాల్ సరిహద్దుతో పాటు నిందితుల దేశానికి వెళ్లి నిఘా పెట్టాయి. హత్య చేసిన అనంతరం ఆటోలో నాంపల్లి రైల్వేస్టేషన్‌కు వెళ్లి, అక్కడినుంచి రైలులో ముంబైకి నిందితులు పారిపోయినట్లు గు ర్తించిన పోలీసులు వారిని ఫాలో అయ్యా రు.ఇందులో భాగంగానే కొన్ని పోలీసు బృందాలు వారి వెంట వెళ్లాయి. ప్రధాన నిందితురాలైన కల్పన పుణెలో ఉంటున్న తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లడంతో ఆమె ను అక్కడే అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. మిగతా ఇద్దరి కోసం పోలీసులు వెతుకుతున్నారు. నిందితులు పట్టుబడితే రాబరీకి సంబంధించిన అన్ని వివరాలు బయటపడతాయని పోలీసులు భావిస్తున్నారు. వీరే చేశారా లేదా నేపాల్ ముఠా నాయకుల హస్తం ఏమైనా ఉందా అనే విషయం బయటపడనున్నది.
తెలిసిందిలా:
నేపాల్‌కు చెందిన కల్పన గతంలో లక్నోలో పనిచేయడంతో అక్కడికి వెళ్లిన నగర పోలీసులు వారిని విచారించారు. తమ వద్ద పనిచేసినప్పుడు కూడా డబ్బులు, నగదు మా యమైనట్లు వారు చెప్పినట్లు తెలిసింది. కల్పన గురించి తెలిసిన నేపాల్‌కు చెందిన ఇతర మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. ఆ మహిళలు ఇచ్చిన సమాచారం ఆధారంగానే కల్పన తల్లిదండ్రులు పుణెలో ఉన్నట్లు బయటపడింది. పోలీసులు కల్పన తల్లిదండ్రులు ఉంటున్న ఇంటిపై నిఘా పెట్టారు. అక్కడికి కల్పన రాగానే అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.















