నవతెలంగాణ-మద్నూర్మండలంలోని చిన్న ఎక్లారా గ్రామంలో గ్రామ పంచాయతీ నూతన బిల్డింగ్ ను సర్పంచ్ మాధవరావు సోమవారం సందర్శించి, పరిశీలించారు. గత కొన్నేండ్లుగా జీపీ కార్యాలయం లేక అద్దె భవనంలో కొనసాగుతూ ఇబ్బందులు పడ్డామని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు చొరవతో ఎట్టకేలకు భవన నిర్మాణం పూర్తైందని తెలిపారు. భవనం నాణ్యమైన మెటీరియల్ తో చాలా అందంగా ముస్తాబైందని, కొత్త శోభతో గ్రామంలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోందని అన్నారు.

The post ప్రారంభోత్సవానికి సిద్ధమైన జీపీ బిల్డింగును పరిశీలించిన సర్పంచ్ appeared first on Navatelangana.