అమరావతి: బర్త్ డే వేడుకలకు రమ్మని పిలిచి ఓ మహిళను ఇద్దరు అన్నదమ్ములు హత్యాయత్నం చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజమహేంద్రవరంలో జరిగింది. పోలసీఉలు తెలిపిన వివరాల ప్రకారం..... రాజమహేంద్రవరంలో అరుణ అనే మహిళకు(పేరు మార్చబడంది) భర్తతో విభేదాలు రావడంతో అతడి దూరంగా ఉంటుంది. మట్టాడి దేవి ప్రసాద్ పరిచయం కావడంతో అతడితో సహజీవనం చేస్తోంది. తన తమ్ముడి అరుణతో కలిసి ఉండడం అతడి సోదరుడు ప్రసాద్‌కు ఇష్టం లేదు. ఈ విషయంలో అన్నదమ్ముల మధ్య గొడవలు జరుగతున్నాయి. దీంతో అరుణను చంపేయాలని అన్నదమ్ములు నిర్ణయం తీసుకున్నారు. గత మంగళవారం అయ్యప్ప పుట్టిన రోజు వేడుకలు ఉన్నాయని అరుణను రమ్మని దేవి ప్రసాద్ కబురు పంపాడు. దీంతో అరుణ ఇంటికి చేరుకున్న తరువాత ఆమె ఫోన్‌లో వీడియోలు చేస్తుండగా ఆమెను వెనక నుంచి ఒకరు చేతులు పట్టుకోగా అయ్యప్ప ఆమె తలపై సుత్తెతో పలుమార్లు కొట్టడంతో ఆమె స్పృహతప్పిపడిపోయింది. చనిపోయిందని అనుకునే ఆమెను స్థానికంగా డంపింగ్ యార్డులో పడేశారు. తెల్లవారుజామున కోన ఊపిరి కొట్టుమిట్టాడుతున్న ఉన్న ఆమెను పారిశుద్ధ్య కార్మికులు గమనించి ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి సిబ్బంది సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆగస్టు 26న కేసు నమోదైతే, 30 వరకు నిందితులను అరెస్టు చేయకపోవడంతో పోలీసులపై విమర్శలు వస్తున్నాయి.