
పంజాబ్ కింగ్స్ జట్టుపై ఢిల్లీ క్యాపిటల్స్ ప్రతీకారం తీర్చుకుంది. గత మ్యాచ్ ఓటమికి ప్రతీకారంగా.. ధర్మశాల వేదికగా సోమవారం రాత్రి జరిగిన మ్యాచ్ లో పంజాబ్ ను ఢిల్లీ దెబ్బకొట్టింది. పంజాబ్ నిర్దేశించిన 211 పగరుల లక్ష్య ఛేదనలో మొదట తడబడిన ఢిల్లీ.. తర్వాత పుంజుకుని అద్భుత విజయాన్ని అందుకుంది. 19 ఓవర్లలోనే 7 వికెట్లు కోల్పోయి ఢిల్లీ 216 పరుగుల చేసి థ్రిల్లింగ్ విక్టరీని అందుకుంది.
ఢిల్లీ బ్యాటర్లలో కెప్టెన్ అక్షర్ పటేల్(56), డేవిడ్ మిల్లర్(51) అర్ధ శతకాలతో రాణించగా.. చివర్లలో అశుతోష్(24), మధవ్(18 నాటౌట్), అకిబ్(10 నాటౌట్) మెరుపులు మెరించడంతో ఢిల్లీ మరో ఓవర్ మిగిలుండగానే మూడు వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో తమ ప్లేఆఫ్ ఆశలను ఢిల్లీ నిలుపుకుంది.












