మన తెలంగాణ/హైదరాబాద్: నాగార్జున సాగర్ నుంచి తెలంగాణకు 16 టిఎంసీలు, శ్రీశైలం నుంచి తెలంగాణకు 6 టిఎంసీల నీళ్లు, ఎపికి సాగర్ నుంచి 10 టిఎంసీల నీటిని కేటాయించాలని కెఆర్‌ఎంబి త్రిసభ్య కమిటీ నిర్ణయించింది. శ్రీశై లం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల జలాల అంశం పై మంగళవారం కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డు కెఆర్‌ఎంబీ హైదరాబాద్ జలసౌధలో సమావేశమైంది. తెలుగు రాష్ట్రాల తాగునీటి అవసరా లు, నీటి నిల్వలు, విడుదలపై అధికారులు చర్చిం చి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. శ్రీశైలం, నా గార్జున సాగర్‌ల నుంచి నీటి విడుదలకు కెఆర్‌ఎంబి అంగీకారం తెలిపింది. తెలంగాణ, ఎపి తా గునీటి అవసరాల మేరకు నీటి విడుదలకు కృష్ణానది యాజమాన్య బోర్డు కీలక నిర్ణయం తీసుకుం ది. ఆగష్టు 15వ తేదీ వరకు ఈ ఒప్పందం అమ ల్లో ఉంటుందని కెఆర్‌ఎంబి పేర్కొంది. ఈనెల 14వ తేదీన మరోసారి దీనిపై చర్చించేందుకు కెఆర్‌ఎంబి సమావేశం కానుంది.

ఇప్పటికే వాటాకు మించి వాడుకున్న ఆంధ్రప్రదేశ్

శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల నుంచి ఎపి ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా అధిక మొ త్తంలో నీటిని తరలిస్తోందని తెలంగాణ అధికారు లు ఫిర్యాదు చేయడంతో ఈ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. దీంతో ఆ వివాదాలకు ముగింపు పలికేలా బోర్డు చర్చలు జరిపి ఈ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇక మరోసారి బోర్డు ఎల్లుండి సమావేశం కానుండటంతో ఆ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది. త్రిసభ్య కమిటీ సమావేశం సాఫీగా సాగిందని ఎపి ఈఎన్సీ నరసింహమూర్తి తెలిపారు. ఈనెలాఖరు వరకు సాగర్ కుడికాలువ నుంచి 10 టిఎంసీల నీరు కావాలని ఎపి కోరగా, ఎపి ఇప్పటికే నీటి వాటాను అధికంగా వినియోగించుకుందని తెలంగాణ ఇరిగేషన్ అధికారులు ఫిర్యాదు చేశారు. ఈనెల 14వ తేదీన బోర్డు సమావేశంలో మిగిలిన అన్నీ అంశాలపై చర్చించనునున్నారు. ఈ సమావేశంలో కెఆర్‌ఎంబి కార్యదర్శి, తెలంగాణ, ఎపి ఈఎన్సీలు, ఇంజనీర్లు పాల్గొన్నారు.