మన తెలంగాణ/సిటీబ్యూరో: ప్ర పంచ పర్యావరణ దినోత్సవం రోజు న హైదరాబాద్ మహానగర శి వారులోని పుప్పాలగూడలో హైడ్రా భారీ ఆపరేష న్ నిర్వహించింది. ప్రకృతిని పరిరక్షిస్తూ చారిత్రాత్మక చరిత్ర ఉ న్న రాళ్లగుట్టలను రక్షించింది. అతి పురాతన గుహలు, వాటి మధ్యన ఉ న్న చెట్లను.. సహజసిద్ధమైన ప్రకృతి ని హైడ్రా కాపాడింది. నగర శివారు ప్రాంతమైన గండిపేట మండలం పుప్పాలగూడ- ఖాజాగూడ గ్రామా ల సరిహద్దుల్లో శుక్రవారం 198 ఎ కరాల ప్రభుత్వ భూమిని హైడ్రా ప రిరక్షించింది. గతంలో హెచ్‌ఎండీఏకు రాష్ట్ర ప్రభు త్వం కేటాయించిన భూమి కూడా ఉంది. చారిత్ర క గుట్టలను కాపాడాలని కోరుతూ దశాబ్దాలుగా ‘సొసైటీ టూ సేవ్ రాక్స్’ ప్రతినిధులు పోరాడుతున్నారు. వీరు హైకోర్టును కూడా ఆశ్రయించారు. ఈ మేరకు రాతి గుట్టలతో పాటు.. ప్రభుత్వ భూ మిని కాపాడాలని 2019లో మున్సిపల్, రెవెన్యూ శాఖలను హైకోర్టు ఆదేశించింది. హద్దులు గుర్తిం చి ఫెన్సింగ్ వేయడం జాప్యం కావడంతో కబ్జాల కు ఆస్కారం ఇచ్చినట్టయింది. ఇదే విషయాన్ని సొసైటీ టూ సేవ్ రాక్స్ ప్రతినిధులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.

ఈ ఫిర్యాదులను రెవె న్యూ, మున్సిపల్ శాఖల అధికారులతో కలిసి హై డ్రా అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ నేపథ్యంలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ నేతృత్వంలో ప్రభుత్వ భూమిగా నిర్ధారించుకుని శుక్రవారం ఫెన్సింగ్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ భూమి విలువ రూ.30 వేల కోట్లు వరకూ ఉం టుందని అంచనా వేస్తున్నారు. సర్వే నంబర్ 452 /1లో 174 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. 454 /1 సర్వే నంబర్‌లో 119.05 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. మొత్తం 293.05 ఎకరాలు కాగా.. ఇందులో 263.05 ఎకరాలను గతంలో రాష్ట్ర ప్రభుత్వం హెచ్‌ఎండీఏకు కేటాయించింది. రెండు గ్రామాల మధ్య ఓవర్‌ల్యాప్ ఇష్యూలతో 63.05 ఎకరాలు ప్రైవేట్ వ్యక్తులకు చెందినదిగా రెవెన్యూ అధికారులు గుర్తించారు. దీంతో హెచ్‌ఎండీఏకు 200ల ఎకరాలు మాత్రమే మిగిలాయి. ఇవే చారిత్రక గుట్టల ప్రాంతంలో వివిధ దేవాలయాలకు 5 ఎకరాలు కేటాయించగా.. దర్గాకు 5 ఎకరాలు అప్పజెప్పినట్టు రెవెన్యూ రికార్డులు చెప్తున్నాయి.


ఇలా వారికి కేటాయించిన భూములు పోగా.. 200 ఎకరాల హెచ్‌ఎండీఏ భూమిని హైడ్రా శుక్రవారం కాపాడింది. సొసైటీ టూ సేవ్ రాక్స్ ప్రతినిధులు కోరిన విధంగా అక్కడ చారిత్రక బండ రాళ్లను కూడా హైడ్రా కాపాడింది. మంచి వ్యూ పాయింట్‌తో... ఎంతో ఎత్తుగా.. సహజసిద్ధంగా ఉన్న గుట్టలకు శతాబ్దాల చరిత్ర ఉన్న కొండలను కాపాడి ప్రకృతిని పరిరక్షించారంటూ రాక్ సొసైటీ ప్రతినిధులు హైడ్రాను కొనియాడారు. రాళ్ల గుట్టలతో పాటు పలు ఆలయాలున్న చారిత్రక స్థలంలో అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా కాపాడిన హైడ్రాకు ప్రజలతో పాటు భక్తులు, పర్యావరణ ప్రేమికులు అభినందనలు తెలిపారు. దశాబ్దాల సమస్యను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం చూపిన చొరవను అభినందించారు. ఈ గుట్టలను ఆనుకొని ఉన్న భగీరథమ్మ చెరువును కూడా హైడ్రా పునరుద్ధరిస్తోంది. ఒక పక్క ఎత్తైన కొండ.. దిగువ భాగంలో ఉన్న భగీరథమ్మ చెరువు సిద్ధమైతే.. ప్రముఖ పర్యాటక ప్రాంతంగా విరాజిల్లుతుందని పలువురు ఈ సందర్భంగా పేర్కొన్నారు.