
మీరు రూ. 30 వేల బడ్జెట్‌లో కొత్త ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే, మీకో గుడ్ న్యూస్! ఈ రేంజ్ లో ఆమోలెడ్ డిస్‌ప్లేలు, శక్తివంతమైన బ్యాటరీలతో కూడిన మూడు అద్భుతమైన స్మార్ట్ ఫోన్స్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. మరి ఆ మోడల్స్ ఏవి? వాటి ధర ఎంతో చూద్దాం.
వన్‌ప్లస్ నార్డ్ సిఇ 6
వన్‌ప్లస్ నుండి వచ్చిన ఈ సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లో 144Hz రిఫ్రెష్ రేట్‌తో కూడిన 1.5K ఆమోలెడ్ డిస్‌ప్లే ఉంది. ఈ పరికరం స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 4 ప్రాసెసర్, 50-మెగాపిక్సెల్ వెనుక కెమెరా, 32-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో వస్తుంది. 8000mAh బ్యాటరీతో వచ్చే ఈ ఫోన్ 8GB + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.29,999
వివో టి5 ప్రో 5జి
ఈ మిడ్-రేంజ్ ఫోన్‌లో 6.83-అంగుళాల ఫుల్ హెచ్‌డి+ అమోలెడ్ డిస్‌ప్లే ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 4 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఇందులో 50-మెగాపిక్సెల్ వెనుక కెమెరా, 9020mAh బ్యాటరీ ఉన్నాయి. భారత టెక్ మార్కెట్లో 8GB + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.29,999.
రెడ్‌మి నోట్ 15 5G
5520mAh బ్యాటరీతో వచ్చే ఈ పరికరం 8GB + 128GB స్టోరేజ్ వేరియంట్ కోసం రూ.24,999 ధరతో లభిస్తుంది. ఈ రెడ్‌మి ఫోన్‌లో 6.7-అంగుళాల కర్వ్డ్ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 6వ జెన్ 3 ప్రాసెసర్, 108-మెగాపిక్సెల్ వెనుక కెమెరా, 20-మెగాపిక్సెల్ ముందు కెమెరా ఉన్నాయి.














