కవిత్వమొక తీరని దాహం.. కొందరి ఆలోచనల తాలూకు అక్షరాలు శతాబ్దాలుగా భవిష్యత్ తరాలకు జ్ఞాన ధార లై, స్ఫూర్తి తారలై, ప్రకాశిస్తూ, ప్రభావితం చేస్తూనే ఉంటాయి. అలాంటి కోవలోని ఓ కవితే ‘ఏక్లా చలో రే’. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ 1905లో బెం గాల్ విభజన సమయంలో జాతీయోధ్యమానికి ఎవ్వరూ రాకపోయినా, ఒంటరిగానే లక్ష్యం వైపు ప్రయాణించమని 30కోట్ల మంది భారతీయుల్ని ప్రేరేపించడానికి రాసిన ప్రసిద్ధ దేశభక్తి గీతం ఇది. ‘ఏక్లా చలో రే’ కవిత జీవితాంతం గాంధీకే కాక, దేశంలోని కోట్లాది మందికి స్ఫూర్తినిచ్చింది. స త్యం, అహింసా మార్గంలో ప్రయాణించేటప్పుడు ఎ వరూ తోడు రాకపోయినా ధృడసంకల్పంతో ఒంటరిగా ముందుకు సాగాలనే ఈ కవితను గాంధీజీ ప్రార్థన సమావేశాల్లో తప్పక పాడేవారు.

ఈ కవిత 1905లో మొదటిసారిగా ‘భండార్’ అనే పత్రికలో ప్రచురితమైంది. ఆ తర్వాత బాఉల్ (Baul) సంకలనంలో కూడా చూడవచ్చు. ఠాగూర్ సంగీత సంపుటి, గీతా బితన్‌లోని స్వదేశీ విభాగంలో ఇది చేర్చబడింది. దాదాపు రెండు దశాబ్దాలకు పైగా నా జీవన గమనం లో, ఎన్నో క్లిష్ట సందర్భాల్లో.. కొన్ని వందలసార్లు నేను ఈ కవితను మననం చేసుకుంటూ నే ఉన్నాను. ఇప్పుడు నా కూతుళ్లకు సైతం ఈ గేయాన్ని నేర్పించాను. సార్వజనీనమైన అం శాలను ఎన్నుకొని, బలమైన భావ గాఢతతో, తాత్విక ధోరణితో సామాన్యులకు ప్రేరణ ఇ చ్చే విధంగా సాధారణ భాషలో రాయడం ఇం దులోని ప్రత్యేకత. ఎలాంటి క్లిష్ట సందర్భంలోనైనా మనిషి తనలోని ఆశావాదాన్ని, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకూడదనే నిగూఢ తాత్పర్యం ఇందులో ఉంది. ఇలాంటి స్ఫూర్తివంతమైన క వితలే మనుషులకు దిక్సూచికలుగా పనిచేస్తా యి. బెంగాల్‌లో ఇప్పుడు నెలకొన్న పరిస్థితు ల్లో బెంగాలీలతో పాటూ, దేశాన్ని ప్రే మించే వాళ్ళందరూ రవీంద్రుని, ఆయన రాసిన ఈ గీతాన్ని మళ్ళీ తప్పక జ్ఞాపకం చేసుకోవాలి.

ఒక్కడివైనా.. ఒంటరివైనా..

నీ ఆశయ పోరాట పిలుపునకు

ఎవ్వరూ స్పందించకపోయినా

నీ గుండె సవ్వడి వింటూ

ఒక్కడివే నడువు

భయంతో ఎవ్వరూ నీతో మాట్లాడక

మౌనయుద్ధం చేస్తుంటే

నువ్వే మనసు తెరలు తీసేసి

నీ కఠోర శ్రమ గెలుపు గీతాలతో

ఇష్టంగా మాట్లాడుకో

కష్టాల అభయారణ్యంలో

వాళ్లు నిన్ను వదిలేస్తే,

ముళ్ళ దారిలో నెత్తురు చిందిస్తూ

భవిష్యత్తు తరాలకు భానుడివై

ఒంటరిగానే నడువు

తుఫాన్ రాత్రుల్లో ఎవ్వరూ దీపం పెట్టకపోయినా

నీ బాధా తప్త హృదయ

జ్ఞాన జ్యోతిని వెలిగించి

దానిని ఒంటరిగానే కాలిపోనీ

విశ్వాన్వేషణ సాగరంలో

నీ విజయ పతాక శీర్షికలను విరచిస్తూ

నువ్వే ఓ నవ్య రహాహదారివై

ఒక్కడివే నడువు

ఒంటరిగానే నడువు

మూలం:

రవీంద్రనాథ్ ఠాగూర్ ‘ఏక్లా చలో రే’

స్వేచ్ఛానువాదం: ఫిజిక్స్ అరుణ్ కుమార్

తెలంగాణలోని నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌కు చెందిన పోతుల అరు ణ్ కుమార్, ఫిజిక్స్ అరుణ్ కుమా ర్‌గా సుపరిచితులు. వివిధ ప్రైవేట్ విద్యా సంస్థల్లో టీచింగ్ ఫ్యాకల్టీగా ఉంటూనే, విద్యా, సా మాజిక, సాహిత్య, సేవా తదితర రంగాలలో రెండు దశాబ్దాలకు పైగా తనదైన ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు. రాష్ట్ర, జాతీయ స్థాయిలోని వివిధ స్వచ్ఛం ద సేవా సంస్థల నుంచి 40కి పైగా పురస్కారాలు పొందారు. ‘శూన్యం’ -కవిత్వం, ‘బిగ్ బ్యాంగ్’ -వ్యా స సంపుటిలు ప్రచురించారు. అనేక కవితలు, ఎడిటోరియల్ పేజీ వ్యాసాలు, పుస్తక సమీక్షలు, బాల ల కథలు అన్ని ప్రముఖ దినపత్రికల్లో ప్రచురించబడ్డాయి.