
అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ౨౦౦౮ డిఎస్సి అభ్యర్థులు 1175 మందికి ఉపాధ్యాయులు గా నియమించిన ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి చిత్రపటానికి ఆ ఉపాధ్యాయులు పాలాభిషేకం చేసి ధన్యవాదాలు తెలిపారు. మంగళవారం మహాత్మా జ్యోతి బా ఫూలే ప్రజాభవన్లో 2008 డిఎస్సి ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు ముఖ్య మంత్రి ఏ. రేవంత్ రెడ్డికి అనుకూలంగా నినాదాలు చేశారు. 17 సంవత్సరాలుగా టీచర్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న తమకు చివరికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్యోగాలు ఇచ్చి ఆదుకున్నారని వారు సంతోషం వ్యక్తం చేశారు. ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన పోస్టింగ్స్ ఇచ్చారని, అయితే కొత్త జిల్లాల ప్రాతిపదికల పోస్టింగ్స్ మార్చాలని వారు సిఎం ప్రజావాణి ఇంచార్జ్ డాక్టర్ జి.చిన్నారెడ్డికి వినతి పత్రాన్ని అందజేశారు. సర్వీస్ సమస్యలు కూడా పరిష్కరించాలని కోరారు. ఈ అంశాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానని చిన్నారెడ్డి వారికి హామీ ఇచ్చారు.













