
మీ నేపథ్యం?ఎప్పటినుండి రాస్తు న్నారు? అచ్చయిన మీ రచనలు? సాహితీ ప్రక్రియల గురించి క్లుప్తంగా చెబుతారా? మా ఊరు చిన్న పెండ్యాల. వరంగల్. మా అమ్మ కౌసల్యాదేవి. నాన్న పెండ్యాల రాఘవరావు. వరంగల్ జిల్లా మొట్ట మొదటి ఎం.పి. సాయుధ పోరాట వీరుడు, స్వాతంత్య్ర సమరయోధుడు. నా భర్త కొండపల్లి వేణుగోపాలరావు. మాకు ఇద్దరు పిల్లలు. మా మామగారు ప్రసిద్ధ చిత్రకారులు కొండపల్లి శేషగిరిరావు. రెండూ గొప్ప చరిత్రలు కలిగిన కుటుంబాల నేపథ్యం నాది. వ్యక్తిగతంగా నేను కవయిత్రిని, రచయిత్రిని. ఎం.ఎ, టి.పి.టి చేసి, 20 ఏళ్లు తెలుగు ఉపాధ్యాయినిగా చేశాను. స్వచ్ఛంద విరమణ అనంతరం ‘ఒద్దిరాజు సోదరుల జీవితం- సాహిత్యం’పై ఉ స్మానియా యూనివర్సిటీలో పి. హెచ్.డి చేసి డాక్టరేట్ తెచ్చుకున్నాను. 198788 నుండి కవిత్వం, వ్యా సాలు రాస్తున్నాను. కానీ పత్రికల్లో నేను ఆలస్యంగా కనిపించాను.
4 కవితా సంపుటాలు, 2 కథా సంపుటాలు, 8 సాహిత్య విమర్శ వ్యాస సంపుటాలు, 3 జీవిత చరిత్రలు, ‘అమెరికాలో ఆరు నెలలు’ అనే యాత్రా చరిత్ర, పీహెచ్‌డి గ్రంథం (700పేజీలు) వంటి నా స్వంత పుస్తకాలు 20 ప్రచురించాను. మరో 8 ముద్రణకు సిద్ధంగా ఉన్నవి. 10 పుస్తకాలకు సంపాదకత్వం వహించాను. 2021 నుంచి మయూఖ, తరుణి అంతర్జాల పత్రికలను నడుపుతున్నాను. మీ కన్నా ముందుతరం మహిళా కవులు రాసిన సందర్భానికి, ఇప్పుడు ఉన్న స్థితికి ఏమైనా మార్పు ఉన్నదా? మీ ముందు తరం కన్నా భిన్నంగా మీరు ఏమి రాస్తున్నారు?
ఇప్పుడు పరిస్థితులు, సమస్యలు మారాయి. చదువుకోవాలని ఉన్నా అవకాశాలు లేక కుటుంబాల కే అంకితమైన స్త్రీల సమస్యల పైన, వాళ్లు కోల్పోయిన జీవితాల స్పర్శతో నూ పద్య కవిత్వం, కథలు, నవలలు రాశారు. ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొన్న నాయిక పాత్రల నూ సృష్టించారు. నాకు పుస్తక పఠనం అలవాటు ఎక్కువనే, కానీ అందరి పేర్లు చెప్పలేనిప్పుడు. కానీ, వాళ్ల రచనలను చదివి ఆశ్చర్యపోయిన సందర్భాలెన్నో! స్త్రీవాద దృక్పథం వచ్చాక వచన కవితా రచన స్వరూపం మారింది. సమాజం చూపే ద్వంద్వ వైఖరులను ఎండగట్టిన సాహిత్యం నాపై చాలా ప్రభావం చూపింది. వర్గ విభేదాలలో కనిపించని కుట్రలు, పర్యావరణ కాలు ష్యం, రాజకీయాలు, అవినీతి, స్త్రీవాద ధోరణి వంటి వస్తు వైవిధ్యంతో కవిత్వం, కథలను విరివిగా రాసాను, రాస్తున్నాను. స్త్రీ పురుషులు ఎవరైనా తప్పులు చేయవద్దు. ఒకవేళ చేస్తే, సరిదిద్దుకోవాలి అనే దృక్పథంతో రచిస్తున్నాను.
సమాజంలోనే కాక సాహిత్యం లోనూ పురుషా ధిపత్యం,సెన్సార్షి ప్ నియంత్రణ ఉన్నాయని వి మర్శ ఉన్నది. ఇప్పటికీ సాహి త్యంలో ఇ లాంటి స్థితి ఉందని మీరు భావిస్తున్నారా? ఒకవేళ ఉందనుకుంటే ఈ స్థితి ఎలా మారు తుంది అనుకున్నారు? అవును మీరు అన్నది నిజం. అంత టా పురుషాధిపత్య సమాజమే. కానీ సాహిత్యంలో మరీ అంతలేదే మో. బాగా రాసిన వాళ్లను గౌరవిస్తారు. కొన్ని కవితలను కొందరు విమర్శించారు. స్త్రీవాదాన్ని సమాజంలో అందరూ పట్టించుకోకున్నా, కవిలోకం గుర్తించింది. స్త్రీవాదమనే పదానికి సరైన క్లారిటీ కూడా లేని రచయితలూ కొందరున్నారు. వీళ్లనొదిలేస్తే, సెన్సార్‌షిప్ లేదు. సృజనాత్మకతను ఎవ్వరూ చంపలేరు. స్టాండర్డ్ రచనలు కాకుంటే విమర్శిస్తారు. ఈ విషయం తప్ప, రచయిత్రులను కొంత వరకూ గౌరవంగానే చూస్తారు. మరో వంక అదే సమయంలో వాళ్ళని రెండవ తరగతి పౌరులుగానే చూస్తున్నారన్నది కూడా నిజమే. ఇలా చూస్తూ, తగినంత మర్యాదనైనా ఇస్తున్నారా లేదా అనేది పురుష ప్రపంచమే ప్రశ్నించుకోవాలి.
ఎందుకంటే ఇవే వైఖరులు కొత్తతరంపై సైతం ప్రతిబింబించి, ఈ వైఖరులు తమకే చాప కింద నీరవుతుందన్న జ్ఞానం కూ డా వాళ్లకి వుండాలి కదా. మహిళా కవులు తమదైన అస్తిత్వ ప్రకటన కవిత్వంలోనూ, కథల్లోనూ చేస్తూనే ఉన్నారు. గాలి కదలికల నుండి, భూమిపై వేసే అడుగుల వరకు అన్నిటా రాజకీయ రంగం ప్రభావం చాలా ఉన్నదని వాళ్ళు గుర్తించారు. ‘తెలంగాణ స్త్రీల సాహిత్యం’ అనే గ్రంథాన్ని నేను వ్రాశాను. ఇంకా ప్రచురించలేదు. ఈ ప్రయత్నంలో నాకు చాలా విషయాలు తెలిసాయి. రాష్ట్రాలు విడిపోయాక సాహితీ క్షేత్రంలో చాలా మార్పులు వచ్చాయి. ఆశ్చర్యకరమేమిటంటే ఇప్పుడు 60, 70 ఏళ్ల రచయిత్రులు కూడా తమ నిరసన గళాల్ని కథల్లో పలికిస్తున్నారు. స్త్రీలపై జరిగే అణిచివేతలను కనిపించని కుట్రలు అంటాను. ఇవి కొత్తతరం రచయితలు తమ అంతర్నేత్రంతో పసిగట్టి రాయాలి.

- డాక్టర్ కొండపల్లి నిహారిణి








