
డిఎంకె నేత, మాజీ మంత్రి ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సనాతన ధర్మం ప్రజలను మతం పేరిట విభజిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు స్టాలిన్ కుమారుడు అయిన ఉదయనిధి . 2023 సెప్టెంబర్‌లో లో కూడా సనాతన ధర్మంపై ఇదే వ్యాఖ్యలు చేసి, పలు తీవ్రస్థాయి విమర్శలకు గురి అయ్యారు. తమిళనాడు అసెంబ్లీలో ఉదయనిధి స్టాలిన్ తొలిసారిగా ప్రతిపక్ష నేత హోదాలో ప్రసంగించారు. సనాతన ధర్మం అనేక అనర్థాలకు దారితీస్తోందని, విభేదాలను పెంచుతోందని, తమిళనాడులో ఈ వాదాన్ని తలెత్తనిచ్చేది లేదని ఉద్బేగభరితంగా తెలిపారు. తమిళ గీతానికి ఎట్టి పరిస్థితుల్లోనూ తొలి ప్రాధాన్యత ఉండాల్సిందేనని, అతి క్రమణను సహించేది లేదని స్పష్టం చేశారు.
తమిళనాడులో అదికారిక లేదా ఏ ఇతర కార్యక్రమాల్లో అయిన జాతీయ గీతానికి ముందుగానే తమిళ తాయ్ వజతూ గీతాలాపనం ఉండాల్సిందే అన్నారు. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ఏ అధికారిక కార్యక్మంలో అయినా, ఇతర చోట్ల అయినా ముందు వందేమాతరం తరువాత జనగణమన తరువాతనే వేరే గీతాలను ఆలాపించాల్సి ఉంటుందని అధికారిక ఉత్తర్వులతో నోటిఫికేషన్ వెలువరించింది. విజయ్ ప్రభుత్వ ప్రమాణ స్వీకార కార్యక్రమం దశలో జరిగిన ఘటనను ఆయన ప్రస్తావించారు. ఇది తొలి పొరపాటు అనుకుంటున్నామని, ఇకపై ఇటువంటివి జరగడానికి వీల్లేదని సిఎం విజయ్‌కు చురకలు పెట్టారు.














