
లండన్: చారిత్రక లార్డ్ మైదానంలో ఇంగ్లండ్ మహిళా జట్టుతో శుక్రవారం ప్రారంభమైన ఏకైక టెస్టులో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 285 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ షఫాలీ వర్మ (0) సున్నాకే పెవిలియన్ చేరింది. వన్‌డౌన్‌లో వచ్చిన యస్తిక భాటియా (12) కూడా నిరాశ పరిచింది. అయితే స్మృతి మంధాన అద్భుత బ్యాటింగ్‌తో జట్టును ఆదుకుంది. కీలక ఇన్నింగ్స్ ఆడిన మంధాన 11 ఫోర్లు, ఒక సిక్స్‌తో 83 పరుగులు చేసింది. జెమీమా (38), కెప్టెన్ హర్మన్‌ప్రీత్ (58), దీప్తి శర్మ (57) తమవంతు పాత్ర పోషించారు.













