ఇంగ్లండ్ అండ్ వేల్స్ వేదికగా.. ఈ ఏడాది జూన్‌లో మహిళల టి-20 వరల్డ్ జరుగనుంది. ఈ ప్రతిష్టాత్మక సిరీస్‌లో మొత్తం 12 జట్లు పాల్గొననున్నాయి. ఈసారి ట్రోఫీ దక్కించుకొనేందుకు అన్ని జట్లు వ్యూహాలను రచిస్తున్నాయి. తాజాగా ఆస్ట్రేలియా ఈ టోర్నీలో పాల్గొనే 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. ఈ జట్టుకు స్టార్ ప్లేయర్ సోఫీ మోలినెక్స్ సారథ్యం వహిస్తుండగా.. వైస్ కెప్టెన్‌గా ఆష్లే గార్డ్‌నర్ వ్యవహరించనుంది.

ఈ జట్టులో ఎల్లిస్ పెర్రీ, బెత్ మూనీ, తహియా మెక్‌గ్రాత్ వంటి స్టార్ ఆటగాళ్లకు చోటు దక్కింది. ముఖ్యంగా ఈసారి సెలెక్టర్లు స్పిన్ బౌలర్లకు ప్రాధాన్యం ఇచ్చారు. ఇంగ్లండ్ పరిస్థితులకు అనుగుణంగా జార్జియా వేర్హమ్, అలానా కింగ్ వంటి లెగ్ స్పిన్నర్లను ఎంపిక చేశారు. అయితే ఫాస్ట్ బౌలర్ డార్సీ బ్రౌన్‌కు చోటు దక్కకపోవడం అభిమానుల్ని కాస్త నిరాశపరిచింది. ఆమె స్థానంలో 20 ఏళ్ల యువ లెఫ్ట్ ఆర్మ్ సీయర్ లూసి హ్యామిల్టన్‌కు అవకాశం దక్కింది. 


టి-20 ప్రపంచకప్‌కి ఆసీస్ జట్టు

సోఫీ మోలినెక్స్ (కెప్టెన్), ఆష్లే గార్డ్‌నర్ (వైస్ కెప్టెన్), తహియా మెక్‌గ్రాత్ (వైస్ కెప్టెన్), నికోలా క్యారీ, కిమ్ గార్త్, లూసీ హామిల్టన్, గ్రేస్ హారిస్, అలనా కింగ్, ఫోబ్ లిచ్‌ఫీల్డ్, బెత్ మూనీ (కీపర్), ఎలిస్ పెర్రీ, మేగన్ షుట్, అన్నబెల్ సదర్లాండ్, జార్జియా వోల్, జార్జియా వేర్‌హామ్. రిజర్వ్ : తాలియా విల్సన్(కీపర్)