తెలంగాణలో భారీ వర్షాలు: బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి, ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా నేడు (సోమవారం) మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆదిలాబాద్, కొమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు పడతాయని, మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు జల్లులు కురవొచ్చని పేర్కొంది. హైదరాబాద్‌లో సాయంత్రం వేళల్లో వర్షాలు పడే అవకాశం ఉందంది.
The post తెలంగాణలో నేడు భారీ వర్షాలు appeared first on Navatelangana.












