
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. ఈరోజు వీకెండ్( శనివారం) కావడంతో శ్రీవారిని దర్శించుకోవడానికి దేశం నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో కొండపైకి వచ్చారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండి వెలుపల క్యూలైన్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 30 గంటల సమయం పడుతున్నట్లు అధికారులు తెలిపారు. కాగా, నిన్న శ్రీవారిని 73,265 మంది భక్తులు దర్శించుకోగా, 39,690 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీ కానుకల ద్వారా నిన్న ఒక్కరోజే రూ.4.26 కోట్లు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.













