చెన్నై: తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా టివికె పార్టీ అధినేత విజయ్ ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా విజయ్‌కి ప్రధాని నరేంద్ర మోడీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.

రాష్ట్రంలో విజయ్ పరిపాలన అద్భతుతంగా సాగాలని మోడీ ఆకాంక్షించారు. ప్రజల అభివృద్ధి కోసం అన్ని రకాలుగా కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి సహకరిస్తుందని మోడీ అన్నారు.

తమళనాడు సిఎంగా ప్రమాణ స్వీకారం చేసిన విజయ్‌కి అభినందనలు. కాంగ్రెస్ పార్టీ తమిళనాడు ప్రజల కోసం కృషి చేస్తూనే ఉంటుందని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఇక సిఎం రేవంత్ రెడ్డి కూడా తమిళనాడు సిఎంగా విజయ్ రాష్ట్రాభివృద్ధిలో ఉన్న శిఖరాలకు చేరుతారని బలంగా నమ్ముతున్నా అని అన్నారు.