
విక్టరీ వెంకటేశ్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ‘ఆదర్శ కుటుంబం’. అయితే ఇంకా షూట్ పూర్తి కాలేదు అని తెలుస్తోంది. ప్రస్తుతం క్లైమాక్స్ షూట్ బ్యాలెన్స్ ఉందని.. అలాగే ఓ సాంగ్ కూడా షూట్ చేయాల్సి ఉందట. సెప్టెంబర్ రెండో వారంలో సాంగ్ షూట్ చేస్తారట. అయితే అక్టోబర్ 2 నుంచి సినిమా వాయిదా పడే విష యం, కొత్తగా అక్టోబర్ 9 లేదా 16 తేదీల్లో ఏదో ఒకదాన్ని ఖరారు చేయ డం వంటి అంశాలపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మొత్తానికి దసరా బరిలో భారీ సినిమాల పోటీ నేపథ్యంలో ‘ఆదర్శ కుటుంబం’ ఎప్పుడు వస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి.
అన్నట్టు ఈ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ప్రధానంగా ఉంటాయని తెలుస్తోంది. ఇక ఈ చిత్రంలో నివేదా పేతురాజ్, యువిన, రాజ్ ప్రజ్పల్, రావు రమేశ్, సత్య, బ్రహ్మాజీ నటిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై నిర్మిస్తు న్న ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ చి త్రంలో వెంకీ సరసన కథానాయికగా ‘కేజీఎఫ్’ బ్యూటీ శ్రీనిధి శెట్టి నటిస్తుండగా, యంగ్ హీరో నారా రోహిత్ ఓ ప్రత్యేకమైన పాత్రలో సందడి చే యనున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ వీడియోలకు సోషల్ మీడియాలో అద్భుతమైన స్పందన లభించింది. త్రివిక్రమ్ మార్క్ ఫ్యామిలీ కామెడీ, సున్నితమైన ఫ్యామిలీ ఎమోషన్స్, వెంకటేశ్ టైమింగ్ ప్రతి ఫ్రేమ్‌లోనూ స్పష్టంగా కనిపిస్తుండటంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.








