
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రిగా టివికె పార్టీ అధినేత విజయ్ ఆదివారం ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో నటి త్రిష ప్రత్యేక ఆకర్షణ నిలిచారు. సాంప్రదాయ పద్దతిలో చీరకట్టులో ఆమె అందరి దృష్టిని ఆకట్టుకున్నారు. విజయ్, త్రిషల మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోందని టాక్ ఉన్న విషయం తెలిసిందే.
వీరిద్దరు కలిసి ఐదు సినిమాల్లో నటించారు. అవి సూపర్ హిట్లుగా నిలవడమే కాకుండా.. ఇద్దరి కెరీర్లను మలుపు తిప్పాయి.. తొలి సినిమా నుంచే ఇద్దరి మధ్య మంచి స్నేహబంధం ఏర్పడింది. ఆదివారం విజయ్ ప్రమాణం చేస్తుండగా.. త్రిష కొంచెం భావోద్వేగానికి గురయ్యారు. అయితే విజయ్ సిఎం అయిన తర్వాత త్రిష తొలి పోస్ట్ పెట్టారు. నీలిరంగు చీరలో ఆమె ఫోటోలను షేర్ చేశారు. దీనికి ‘‘ప్రేమ ఎప్పుడూ గొప్పగానే వ్యక్తమవుతుంటుంది’’ అని క్యాప్షన్‌ని జత చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.














