
నేపాల్ వరదలు సృష్టించిన బీభత్సంలో మృతుల సంఖ్య 547కు చేరింది. మరో 977 మంది జాడ గల్లంతయినట్టు నేపాల్ డిజాస్టర్ అథారిటీ శుక్రవారంనాడు తెలిపింది. బుధవారంనాటి ప్రకృతి వైపరీత్యంలో కనీసం ఐదు మంది మరణించినట్టు చైనా ప్రభుత్వ మీడియా తెలిపింది. దీంతో ఇరువైపులా మృతుల సంఖ్య 552కు చేరుకుంది. అలాగే జాడగల్లంతైన వారి సంఖ్య 1,500 మందికి పైనే ఉన్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. 14,000 మందికి పైగా భద్రతా సిబ్బందితో మూడో రోజు కూడా గాలింపు, సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. సుమారు 3,742 మందిని భద్రతా సిబ్బంది కాపాడారు.
నేపాల్‌లో ఆచూకీ గల్లంతైన వారి కోసం జరుపుతున్న రెస్క్యూ ఆపరేషన్‌లో శుక్రవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. త్రిశూలి 3ఏ హైడ్రోపవర్ ప్రాజెక్టు వద్ద సొరంగంలో చిక్కుకున్న వారిలో 350 మందిని నేపాల్ సైన్యం కాపాడింది. ఒకవైపు వరద బాధితుల సొత్తును కొందరు దోచుకుంటున్న వేళ నేపాల్‌లో ఓ వ్యక్తి మానవత్వం చాటుకున్నాడు. వరదల్లో కొట్టుకొచ్చిన కబోర్డును తెరవగా అందులో లభ్యమైన బంగారం, వెండి, నగదును ఆ వ్యక్తి పోలీసులకు అప్పగించాడు. బిల్లుపై 'జై శ్రీ మహాలక్ష్మి గోల్డ్ అండ్ సిల్వర్ షాప్' అని ఉందని చెప్పాడు. దాని యజమానులు పోలీసులను సంప్రదించాలని కోరాడు








