
మన తెలంగాణ/ఖమ్మం బ్యూరో: రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి రెగ్యులర్ సిఎం కాదు రెన్యూవల్ సిఎం అని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కల్వకుంట్ల తారక రామారా వు ఎద్దేవా చేశారు. బుధవారం ఖమ్మం సత్తుపల్లి పట్టణంలో సర్ పక్రియపై బిఆర్‌ఎస్ కార్యకర్తలకు ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ తెలంగాణ నలుమూలల ఎక్కడికి వెళ్లినా.. ఈ దుర్మార్గ పాలన పోవాలి.. కేసీఆర్ పాలన రా వాలి అని ప్రజలు కోరుతున్నారని, ఇటీవల కర్నాటక పరిణామం తెలంగాణలో ఏర్పడ్డ అశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నారు. కాంగ్రెస్ మాయమాటలు విని మోసపోతే గోస తప్పదని ఆనాడే కేసీఆర్ చెప్పారని కాని ప్రజలు కేసిఆర్ మాట నమ్మలేదన్నారు. 72 లక్షల మంది రైతుల ఖాతాలో 73 వేల కోట్లు వేసిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని, ఇప్పుడున్న ముఖ్యమంత్రి 72 సార్లు ఢిల్లీకి పోయి.. పైసా తెచ్చింది లేదని రైతు భరోసా అరకొరగా వేసి చేతులు దుల్పుకున్నారని ఆయన అన్నారు.గత రెండున్నరేళ్లలో మూ డుసార్లు రైతుబంధు ఎగ్గొట్టారని ఆయన అన్నారు. అన్నిరకాల వడ్లకు బోనస్ అని ఎన్నికల్లో మాటిచ్చి చివరికి ఏడు రకాలకు కుదించి రైతులను దగా చేస్తున్నారని ఆయన అ న్నారు.
సంచులన్నీ ఢిల్లీకి పోతున్నై కాబట్టే కొనుగోలు కేంద్రాల్లో రైతులకు గన్నీబ్యాగు లు దొరకని దుస్థితి ఏర్పడిందని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో రైతుబంధు పడటం లేదుకానీ.. ఢిల్లీలో ఠంచన్‌గా ‘రాహుల్ బంధు‘ మాత్రం పడుతోందన్నారు. షాపుల్లో లేని యూరియా.. యాప్‌లో ఎక్కడ ఉంటదని ఆయన ప్రశ్నించారు.వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు మెజారిటీ స్థానాలు కట్టబెడితే.. యూరియా యాప్‌ను బంగాళాఖాతం లో పడేస్తామన్నారు. మళ్లీ ఆటో అన్నకు ఫోన్ చేస్తే, పొలం కాడికి యూరియా ఇచ్చి పో యే రోజులు తెస్తామన్నారు. పవర్ ఫుల్ శాఖలన్నీ ఖమ్మం జిల్లాలోని ముగ్గురు మంత్రుల చేతిలోనే ఉ న్నా ఈ ముగ్గురు మం త్రులతో ఖమ్మం జిల్లాకు ఒరిగింది శూన్యమన్నా రు. రాష్ట్ర రెవెన్యూ పడిపోతోంది. రెవెన్యూ మంత్రి సంపద మాత్రం పెరుగుతోందన్నారు. మంత్రి పొంగులేటి భూ కబ్జాలు, ఇసుక దందా లో మునిగి తెలుతున్నారని ఆయన అన్నారు. వ్య వసాయ శాఖ మంత్రి తుమ్మల మట్టి దందాలో బి జిగా ఉన్నారని, బుగ్గపాడు భూముల అప్పనం గా ఎపికి కట్టబెట్టారని, మార్కెట్ విలువకు విరుద్ధంగా భూములను కట్టబెట్టారని ఆయన అన్నా రు. 60 లక్షల ప్రభుత్వ ధర ఉంటే 21 లక్షల రూ పాయలకు ఏపికి చెందిన ప్రైవేట్ కంపెనీకి ప్ర భుత్వం కేటాయించిందని, దేనికోసం ప్రభుత్వ భూములు దోచుకోవడం అని ఆయన ప్రశ్నించారు.
జర్నలిస్టుల గౌరవాన్ని కాపాడండి
నియోజకవర్గ, డివిజన్ కేంద్రాల్లో పనిచేసే విలేకరులకు బీఆర్‌ఎస్ హయాంలో స్టేట్ అక్రిడేషన్ కా ర్డులను జారీ చేశామని, కాంగ్రెస్ హయాంలో వా టి విషయంలోనూ అన్యాయం చేశారన్నారు. ఈ జిల్లాకు చెందిన ఐ అండ్ పీ ఆర్ మంత్రి విలేకరుల గౌరవానికి తగ్గట్టుగా కార్డులు ఇవ్వాలని, లేకపోతే హైదరాబాద్ వేదికగా ప్రభుత్వంపై బీఆర్‌ఎస్ పక్షాన వత్తిడి తీసుకువస్త్తామని హెచ్చరించారు.












