
ఎస్పిర్ మిషన్‌లోని డబ్బులు మాయం అయిన సంఘటన యూసుఫ్‌గూడలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో చోటుచేసుకుంది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. యూసుఫ్‌గూడ ఎస్‌బిఐలో క్యాష్ ఇన్‌చార్జిగా అబ్బిరెడ్డి యాదగిరి రెడ్డి పనిచేస్తున్నారు. గత ఏడాది అక్టోబర్ 7వ తేదీన బ్రాంచిలోని ఎటిఎం స్థానంలో ఎస్‌పిఆర్ మిషన్‌ను ఏర్పాటు చేయాలని బ్యాంక్ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా మిషన్‌ను బ్యాంక్‌లో ఏర్పాటు చేశారు. బ్యాంక్ ఎటిఎం నుంచి డబ్బులు తీయకుండానే తీసినట్లు ఎంట్రీ, బోగస్ ఎంట్రీలు సృష్టించారు.
తర్వాత యాదగిరి రెడ్డి, సిబ్బంది కలిసి ఎటిఎంలోని డబ్బు పెట్టెలను బ్యాంక్ స్ట్రాంగ్ రూంకు తరలించారు. బ్యాంక్ అధికారులు డబ్బు పెట్టెలను లెక్కించగా తేడా వచ్చింది. రూ. అందులో 23లక్షలు మాయం అయినట్లు గుర్తించారు. సిసిటివి ఫుటేజ్ పరిశీలించగా యాదగిరి రెడ్డి ఉద్దేశపూర్వకంగా మోసానికి పాల్పడినట్లు గుర్తించారు. బ్యాంక్ ఛీఫ్ మేనేజర్ కిరణ్‌కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.














