
దుల్కర్ సల్మాన్ భారీ బడ్జెట్ ఫాంటసీ థ్రిల్లర్ ‘ఐయామ్ గేమ్’ నుంచి రెండో సింగిల్ ‘లూజర్’ విడుదలైంది. జేక్స్ బిజోయ్ స్వరపరిచిన ఈ పాటను మలయాళంలో దుల్కర్ సల్మాన్ స్వయంగా ఆలపించారు. సుహైల్ కోయా సాహిత్యం అందించారు. మలయాళ వర్షన్లో కె. బాలసరంగన్, జేక్స్ బిజోయ్ కూడా గాత్రం అందించారు. ఈ పాటను మలయాళం, తమిళం, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో విడుదల చేశారు. తమిళ, తెలుగు వర్షన్లను బెన్నీ దయాల్ ఆలపించగా, విఘ్నేష్ రామకృష్ణ(తమిళ్), సనారే(తెలుగు) సాహిత్యం అందించారు.
ఈ చిత్రం సెప్టెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అన్నపూర్ణ స్టూడియోస్ ఈ చిత్రాన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో గ్రాండ్‌గా విడుదల చేయనుంది. స్టైలిష్, ఎలక్ట్రిఫైయింగ్ మ్యూజికల్ స్టైల్లో రూపొందిన ‘లూజర్’ సాంగ్ యువతను ఆకట్టుకునేలా ఉంది. ‘ఐయామ్ గేమ్’ ఆడియో లాంచ్, ప్రీ- రిలీజ్ ఈవెంట్ ఆగస్టు 29న సాయంత్రం 6 గంటల నుంచి కక్కనాడలోని కిన్‌ఫ్రా ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ సెంటర్లో జరగనుంది. సరికొత్త స్టైలిష్ ఫాంటసీ థ్రిల్లర్ అనుభూతిని ఈ సినిమా అందించబోతుంది. ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్‌తో పాటు ఆంటోనీ వర్గీస్, తమిళ నటుడు, -దర్శకుడు మిస్కిన్, కాయదు లోహర్, కతిర్, పార్థ్ తివారీ, సంయుక్త విశ్వనాథన్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దర్శకుడు నహాస్ హిదాయత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.








