5570 articles


ప్రస్తుతం ఎక్కడ చూసిన ఐపిఎల్ ఫీవర్ నడుస్తోంది. ప్రస్తుతం టోర్నమెంట్ లీగ్ దశలో ఉంది. దీంతో ఎవరు ప్లేఆఫ్స్‌కి చేరుతారు. ఏ జట్టు కప్పుకొడుతుంది అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే ఈ ఐపిఎల్ ముగిసిన తర్వాత భారత టి-20 జట్టులో కీలక మార్పులు చోటు చేసుకొనే అవకాశం ఉంది. ముఖ్యంగా జట్టు కెప్టెన్సీలో మార్పు జరుగుతుందని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం టి-20 జట్టుకు సూర్యకుమయ యాదవ్ కెప్టెన్‌గా ఉన్నాడు. సూర్య కెప్టెన్సీలోనే ఈ ఏడాది భారత్ టి-20 ప్రపంచకప్‌ను సొంతం చేసుకుంది. అయినప్పటికీ.. సూర్యను ఆ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఆ స్థానంలో శ్రేయస్ అయ్యర్‌కు సారథ్య బాధ్యతలు అప్పగిస్తారట. అయితే ఇప్పుడు కెప్టెన్ రేసులో మరో పేరు వచ్చి చేరింది. అదే సంజూ శాంసన్. ప్రస్తుతం సంజు ఐపిఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతున్నాడు. మంచి ఫామ్‌లోనూ ఉన్నాడు. దీంతో సెలక్టర్లు సంజూ వైపు మొగగు చూపతారని విశ్లేషకుల అంచనా. మరి కెప్టెన్సీ సంజూకి లేదా శ్రేయస్‌కి ఇస్తారా.. లేదా సూర్యనే కొనసాగతాడా చూడాలి.

అమరావతి: పోలవరం జిల్లా రంపచోడవరం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. పాత గాంధీనగరం మలుపు వద్ద ఆర్టిసి బస్సు బోల్తా పడింది. 40 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. భద్రాచలం నుంచి కాకినాడ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రాణ నష్టం జరగలేదని అక్కడ వారందరూ ఊపిరిపీల్చుకున్నారు.



నవతెలంగాణ – హైదరాబాద్ : తమిళనాడు రాజకీయాల్లో నెలకొన్న ఉత్కంఠ ఇప్పుడు హైదరాబాద్‌కు చేరింది. రాష్ట్రంలో ‘హంగ్’ ఏర్పడటంతో, ఎమ్మెల్యేల కొనుగోలుకు బేరసారాలు జరుగుతాయనే భయంతో తమిళనాడు కాంగ్రెస్ కమిటీ తమ ఐదుగురు ఎమ్మెల్యేలను ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు తరలించింది. తమిళనాడులో సంక్షోభం సమసిపోయేంత వరకు వీరు హైదరాబాద్‌లోని ఒక రిసార్ట్‌లో బస చేయనున్నట్టు సమాచారం. తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకేకి మద్దతు ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ తన ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి తెలంగాణను సురక్షిత ప్రాంతంగా ఎంచుకుంది. […] The post హైదరాబాద్ లో తమిళనాడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు appeared first on Navatelangana.




నవతెలంగాణ – హైదరాబాద్ :కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడిపై పోక్సో కేసు నమోదైనట్లు తెలుస్తోంది. బాలికకు ఆల్కహాల్ తాగించి లైంగికదాడి చేయించడంతో పేట్‌బషీరాబాద్‌లో కేసు నమోదైనట్లు సమాచారం. 17 ఏండ్ల బాలికకు బండి సంజయ్ కుమారుడు బలవంతంగా మద్యం తాగించి ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడని తెలుస్తోంది. హైదరాబాద్ మొయినాబాద్ ఫామ్‌హౌస్‌తో పాటు మరో రెండు ప్రాంతాల్లో లైంగికదాడికి పాల్పడ్డాడని సమాచారం. దీంతో బాలిక రెండుసార్లు ఆత్మహత్యకు యత్నించింది. చివరకు శుక్రవారం రాత్రి బాధితురాలి […] The post కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడిపై పోక్సో కేసు నమోదు! appeared first on Navatelangana.


హైదరాబాద్: తమ్మిడిహట్టి ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని, బిఆర్ఎస్ పై చేస్తున్న దుష్ప్రచారాన్ని మాజీ మంత్రి, బిఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు తీవ్రంగా ఖండించారు. సిద్దిపేటలోని క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మేడిగడ్డ వద్ద కుంగిన రెండు పిల్లర్లకు మరమ్మతులు చేయకుండా రాష్ట్ర ప్రయోజనాలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం గాలికి వదిలేసిందని, వచ్చే ఏడాది రాబోయే కరువును ఎదుర్కోవాలంటే మేడిగడ్డ రిపేర్లు వెంటనే పూర్తి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నిన్న ఆదిలాబాద్ జిల్లా తమ్మిడిహట్టి వద్ద కాంగ్రెస్ మంత్రుల హడావిడి చూసిన తర్వాత ఒక విషయం అర్థమవుతోందని, పని తక్కువ ప్రచారం ఎక్కువ అని చురకలంటించారు. మంత్రులకు వాగుడు తప్ప చేతలు శూన్యమని ఎద్దేవా చేశారు. ఎల్ నినో ప్రభావంతో కరువు వస్తుందని తెలిసినప్పుడు హడావిడిగా బాయి తవ్వినట్లు కాకుండా ముందస్తుగా మేడిగడ్డ రిపేర్లు చేయాలని సూచించారు. కానీ దాన్ని వదిలేసి తమ్మిడిహట్టి కడుతున్నట్లు పేపర్లకు ఫోజులిస్తున్నారని, కురచ బుద్ధితో బిఆర్ఎస్ పై బురద జల్లే కార్యక్రమం తప్ప వారు చేస్తున్నది శూన్యమని మండిపడ్డారు. 150 మీటర్ల ఎత్తులో నిర్మా




నవతెలంగాణ – హైదరాబాద్ : ప్రముఖ కార్మిక సంఘ నాయకుడు, సీఐటీయూ ఒరిస్సా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిష్ణు మొహంతి శనివారం తెల్లవారుజామున 3:30 గంటలకు కన్నుమూశారు. కార్మిక హక్కుల కోసం దీర్ఘకాలంగా పోరాడిన ఆయన మరణం కార్మిక ఉద్యమానికి తీరని లోటని పలువురు కార్మిక సంఘాల నాయకులు పేర్కొన్నారు. ఆయన మృతికి నివాళులర్పించారు. బిష్ణు మొహంతి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. The post ఒరిస్సా సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిష్ణు మొహంతి కన్నుమూత appeared first on Navatelangana.


నవతెలంగాణ – హైదరాబాద్: పశ్చిమ బెంగాల్ సీఎంగా సువేందు అధికారి ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. కోల్‌కతాలోని పరేడ్ గ్రౌండ్లో శనివారం ఈ వేడుక జరిగింది. ఇటీవల వెలువడిన ఎన్నికల ఫలితాల్లో టీఎంసీ (మమతా బెనర్జీ)పై బీజేపీ భారీ విజయం సాధించింది. సువేందు అధికారి ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, నితీన్ గడ్కరీ, రామ్మోహన్ నాయుడు, ఏపీ సీఎం చంద్రబాబు తదితరులు హాజరయ్యారు. The post బెంగాల్ సీఎంగా సువేందు అధికారి ప్రమాణం appeared first on Navatelangana.

కోల్ కతా : బెంగాల్ లో బిజెపి ప్రభుత్వం కొలువుదీరింది. పశ్చిమ బెంగాల్ తొలి బిజెపి ముఖ్యమంత్రిగా సువేందు అధికారి బాధ్యతలు స్వీకరించారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ప్రమాణస్వీకారం చేశారు. సువేందుతో గవర్నర్ ఆర్ ఎన్ రవి ప్రమాణ స్వీకారం చేయించారు. 1971 తర్వాత కలకత్తాయేతర జిల్లా నుంచి సిఎం పదవికి సువేందు మొదటి వ్యక్తి కావడం గమనార్హం. కోల్ కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్ లో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ, హోంశాఖ మంత్రి అమిత్ షా, మంత్రులు రాజ్ నాథ్ సింగ్, జెపి నడ్డా, ఎపి సిఎం చంద్రబాబు నాయుడు, యూపి సిఎం యోగి ఆదిత్యనాథ్, ఎన్డియే పాలిత రాష్ట్రాల సిఎంలు, కేంద్రమంత్రులు హాజరయ్యారు. ప్రమాణస్వీకారం చేసిన అనంతరం మోడీ ఆశీస్సులు సువేందు తీసుకున్నారు.




తన కెరీర్‌లో విభిన్నమైన సినిమాలు చేస్తూ.. ఫ్యాన్స్‌ని అలరిస్తూ వస్తున్నాడు విజయ్ దేవరకొండ. ప్రస్తుతం విజయ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. అతడు నటిస్తున్న సినిమాల్లో ఒకటి ‘రౌడీ జనార్ధన’. కాగా, శనివారం విజయ్ దేవరకొండ పుట్టిన రోజు సందర్భంగా చిత్ర యూనిట్ ప్రత్యేక పోస్టర్‌తో విషెస్ తెలిపింది. ఇందులో విజయ్ కూర్చొని ఉండగా.. హీరోయిన్ అతడి గుండెపై కాలు మోపి ఉండటం మనం చూడొచ్చు. ‘ప్రపంచంతో పోరాడతాడు.. ప్రేమకు లొంగిపోతాడు’ అంటూ ఈ పోస్టర్‌కి క్యాప్షన్ ఇచ్చింది. దీంతో ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలతో పాటు.. మంచి లవ్ ట్రాక్ కూడా ఉంటుందని అర్థమవుతోంది. ఇక రవికిరణ్ కొలా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తూర్పుగోదావరి ప్రాంతంలో 80వ దశకంలో సాగిన కథగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది.