5570 articles


కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లో శనివారం కొత్త ప్రభుత్వం కొలువుదీరిన విషయం తెలిసిందే. తొలిసారి ఆ రాష్ట్రంలో బిజెపి సర్కార్‌ను ఏర్పాటు చేసింది. సువేందు అధికారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. అయితే మాజీ సిఎం మమతా బెనర్జీ ఈ నేపథ్యంలో తన ఓటమిని అంగీకరించారు. ఇటీవల వెలువడిన ఎన్నికల ఫలితాల్లో అవకతవకలు జరిగాయని మమతా ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె తన సిఎం పదవికి రాజీనామా చేయనని తేల్చి చెప్పేశారు. అయితే మే 7వ తేదీతో అసెంబ్లీ గడువు ముగియడంతో గవర్నర్ దానిని రద్దు చేశారు. తాజాగా బిజెపి నూతన ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీంతో దీదీ తన ఓటమిని అంగీకరిస్తూ.. ఎక్స్ ఖాతాలో బయోను మార్చేశారు. ‘ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ వ్యవస్థాపక ఛైర్‌పర్సన్, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి(15వ, 16వ, 17వ విధాన్‌సభ)’గా ఆమె తన బయోని అప్‌డేట్ చేశారు. అంతకు ముందు అక్కడ ‘పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి’ అని మాత్రమే ఉండేది.

నవతెలంగాణ – ధర్పల్లిమండలంలోని సీతాయిపేట్ గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ పద్మావతి గోదాసమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ విగ్రహం ప్రతిష్ఠాపన మహోత్సవంలో శనివారం నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆలయంలో స్వామివారిని దర్శించుకున్నారు. అంతకుముందు ఆలయానికి విచ్చేసిన ఎమ్మెల్యేను ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామస్తులంతా ఐక్యంగా ఉంటూ.. ఆలయ నిర్మాణం చేపట్టడం అభినందనీయమన్నారు. ఆ భగవంతుని ఆశీస్సులు ప్రజల పై […] The post విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే appeared first on Navatelangana.

-రోడ్లపై మట్టి.. వాహనదారులకు చుక్కలు-భద్రతా చర్యలు శూన్యం.. ప్రమాదాలకు ఆహ్వానం-స్పందించని అధికారులు..పెరుగుతున్న ఇబ్బందులునవతెలంగాణ – రాయికల్ పట్టణంలో ఓ ప్రైవేట్ సంస్థ చేపడుతున్న అండర్‌గ్రౌండ్ ఫైబర్ కేబుల్ తవ్వకాలు అస్తవ్యస్తంగా మారాయి.ప్రధాన రహదారులు,వ్యాపార సముదాయాలు,నివాస గృహాల ఎదుట ఎక్కడపడితే అక్కడ గుంతలు తవ్వుతూ ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.తవ్వకాల సమయంలో ఎలాంటి భద్రతా చర్యలు తీసుకోకపోవడంతో పాటు హెచ్చరిక బోర్డులు,బారికేడ్లు ఏర్పాటు చేయకపోవడం ప్రమాదాలకు దారితీస్తోందని అంటున్నారు.తవ్విన గుంతలను సరిగా పూడ్చకపోవడంతో […] The post ఇష్టారాజ్యంగా ఫైబర్ కేబుల్ తవ్వకాలు appeared first on Navatelangana.

నవతెలంగాణ-రాయికల్ఈ నెల 10న హన్మకొండలో నిర్వహించే రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు మండలంలోని అల్లీపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఎంపికైనట్లు ప్రధానోపాధ్యాయులు పోరండ్ల కిరణ్ కుమార్,పీడీ కృష్ణ ప్రసాద్ తెలిపారు. అండర్-16 విభాగంలో శ్రీ హర్షవర్ధన్ లాంగ్ జంప్, బి.రిషి కుమార్, టి.నవదీప్ జావెలిన్ త్రోలో,అండర్-18 విభాగంలో డి.విశ్వేష్ లాంగ్ జంప్‌లో ఎంపికయ్యారు. ఇటీవల నిర్వహించిన జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలలో ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయికి అర్హత సాధించారు. ఎంపికైన విద్యార్థులను సర్పంచ్ […] The post రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు అల్లీపూర్ విద్యార్థులు appeared first on Navatelangana.



నవతెలంగాణ – జుక్కల్ జిల్లా స్థాయి మాదిరిగానే డివిజన్ స్థాయిలో కూడా ప్రజావాణి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని జుక్కల్ ఎమ్మార్వో మారుతి తెలిపారు. ఈ సందర్భంగా శనివారం తహశీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలు వారి సమస్యల పరిష్కారం కొరకు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు గ్రామీణ ప్రాంతాల అవసరాల దృష్ట్యా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజాసేవలు అందించాలని డివిజన్ స్థాయిలో నిర్వహించడం […] The post డివిజన్ స్థాయిలో కూడా ప్రజావాణి కొనసాగింపు appeared first on Navatelangana.

టీం ఇండియా, ముంబై ఇండియన్స్ స్టార్ ఆటగాడు రోహిత్ శర్మకి ఓ చేదు అనుభవం ఎదురైంది. రోహిత్ కారులో నుంచి అభిమానులకు అభివాదం చేస్తుండగా.. ఇద్దరు చిన్నారులు వచ్చి ఆయన చేతికి ఉన్న వాచ్‌ని లాగే ప్రయత్నం చేశారు. వెంటనే అప్రమత్తమైన హిట్ మ్యాన్ తన చేతిని లోపలకి తీసుకొని.. వాచ్‌ని లాగే ప్రయత్నం చేసిన వారిని మందలిస్తూ.. కారు అద్దాన్ని పైకి ఎత్తేశాడు. ఈ ఘటన ఎక్కడ, ఎప్పుడు జరిగిందో తెలియదు కానీ.. ఇందుకు సంబంధించిన వీడియో మాత్రం వైరల్ అవుతోంది. రోహిత్ ధరించిన ఆ వాచ్ ఖరీదు రూ.3.25 కోట్లని తెలుస్తోంది. వాచ్ బ్రాండ్ పేరు రోలెక్స్ జిరాఫ్ అని సమాచారం. ఇక రోహిత్ ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్‌తో బిజీగా ఉన్నాడు. సీజన్‌లో కొన్ని మ్యాచ్‌లు గాయం కారణంగా దూరమైన రోహిత్, ఎంఐ, లక్నోతో జరిగిన మ్యాచ్‌తో రీఎంట్రీ ఇచ్చాడు. ఈ మ్యాచ్‌లో 44 బంతుల్లో 84 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయినప్పటికీ.. ముంబైకి ఈ విజయం అంతగా కలిసి రాలేదు. ఎంతకంటే అప్పటికే ఆ జట్టుకు ప్లేఆఫ్స్ ఆశలు దూరమయ్యాయి. ఇప్పుడు మిగిలిన నాలుగు మ్యాచుల్లో గెలిచినా.. ప్లేఆఫ్స్‌కి వెళ్లడం అసాధ్యమనే చెప్పాలి.

నవతెలంగాణ- హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు తన నివాసంలో ఆమరణ నిరాహారదీక్షను ప్రారంభించారు. బీసీ కులగణన చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఆయన దీక్షకు దిగారు. రాజకీయ పార్టీలకు అతీతంగా బీసీల అభ్యున్నతి జరగాలంటే, ముందుగా వారి జనాభా ఎంత ఉందో స్పష్టంగా తెలియాలని ఆయన అంటున్నారు. జనగణనలో బీసీ కులాలను కూడా లెక్కించడం ద్వారానే విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో జనాభా ప్రాతిపదికన న్యాయం జరుగుతుందని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మే 8 […] The post నిరాహార దీక్షకు దిగిన కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ appeared first on Navatelangana.

హైదరాబాద్: హైదరాబాద్ నగరాన్ని ట్రాఫిక్ ఫ్రీగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నామని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. సిగ్నల్ ఫ్రీ సిటీగా హైదరాబాద్ ను తీర్చిదిద్దే ప్రణాళికలతో ముందుకెళ్తున్నామని అన్నారు. సచివాలయంలో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో సిఎం రేవంత్ రెడ్డి, కమిటీ ఛైర్ పర్సన్ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, సిఎస్ రామకృష్ణారావు, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు హాజరయ్యారు. గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారంపై చర్చ జరిపారు. ఆధునీకరణ, పట్టణీకరణతో భవిష్యత్ లో మరిన్ని కొత్త సవాళ్లు ఎదుర్కోవాలని, పెరుగుతున్న పట్టణ జనాభాకు అనుగుణంగా మౌలిక వసతులు అభివృద్ధి చేయాలని అధికారులకు సూచించారు. అండర్ పాస్, సర్ఫేస్, ఎలివేటెడ్ అనే త్రీ లెవెల్ విధానాన్ని తీసుకు రావాలని, ట్రాఫిక్ నియంత్రణకు కేవలం రోడ్ల విస్తరణ మాత్రమే సరిపోదని అన్నారు. మల్టీ ట్రాన్స్ పోర్టు సిస్టమ్ ను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని, పార్కింగ్ ఇబ్బందులు అధిగమించేందుకు మల్టీ లెవెల్ పార్కింగ్ ఏర్పాటు చేస్తున్నామని, రాష్ట్రాన్ని 3 విభాగాలుగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించామని తెలియజేశారు. ఔటర్ రింగ్ రోడ్డు క్యూర్ ఏరియాను సర్వీస

చెన్నై: టివికె పార్టీపై ఎఎంఎంకె పార్టీ నేత దినకరన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమ్మ మక్కల్ మున్నేట్ర కజగం పార్టీ లేఖను ఫోర్జరీ చేశారని మండిపడ్డారు. మొత్తం వీడియోను టివికె ఎందుకు విడుదల చేయడం లేదు? అని ప్రశ్నించారు. టివికె విడుదల చేసిన లేఖ తమ పార్టీ కాదు అని స్పష్టం చేశారు. మా లేఖకు దానికి చాలా తేడా ఉందని, ఆ వీడియో ఒరిజినల్ కాదని మా అనుమానం అని పేర్కొన్నారు. కామరాజ్ పేరుతో ఫేక్ లెటర్ గవర్నర్‌కు ఇచ్చారని, ఫోర్జరీ కేసుపై దర్యాప్తు చేయాలని దినకరన్ సూచించారు. తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుపై ప్రతిష్ఠంభన ఏర్పడింది. విసికె పార్టీ ఎటూ తేల్చకపోవడంతో ప్రభుత్వ ఏర్పాటు సందిగ్ధంలో పడింది. విజయ్‌కు మద్దతుపై విసికె క్లారిటీ ఇవ్వడం లేదు. వీసీకే ప్రెస్‌మీట్ సాయంత్రం 4 గంటలకు మారింది. విసికె క్లారిటీ ఇస్తేగానీ ప్రభుత్వ ఏర్పాటుపై స్పష్టత రావడం లేదు. ఢిల్లీ పెద్దల సూచన ప్రకారం ఇక్కడ స్క్రీన్‌ప్లే నడుస్తోంది. ఎలాగైనా అన్నాడిఎంకెను అధికారంలోకి తీసుకురావాలని ప్రయత్నాలు జరుగుతున్నట్టు సమాచారం. అందుకే రిసార్ట్‌ల నుండి ఎడిఎంకె ఎమ్మెల్యేలను చెన్నైకి పిలిపించారు. విసికె మాకు మద్దతిస్తుందని నమ్మకం తమకుందని, ఈ సం

నవతెలంగాణ – హైదరాబాద్ : కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని దేవునిపల్లి గ్రామంలో గ్యాస్ నింపుతుండగా కారు ట్యాంక్ పేలింది. ఈ ఘటనలో కారు పక్కన పార్క్ చేసిన మరో రెండు కార్లు, ఒక ద్విచక్రవాహనం అగ్నికి ఆహుతయ్యాయి. పేలుడు శబ్దానికి స్థానికులు భయపడ్డారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. The post కారులో గ్యాస్ నింపుతుండగా భారీ పేలుడు… appeared first on Navatelangana.


నవతెలంగాణ – హైదరాబాద్ : పెండ్లి విందులో పెట్టిన స్వీట్లు తిని 105 మంది తీవ్ర అస్వస్థతకు గురైన ఘటన రాజస్థాన్‌లోని కోట్‌పుత్లి-బెహ్రోర్ జిల్లాలో జరిగింది. విరాట్‌నగర్ ఏరియాలో ఉన్న ధని గస్కాన్ గ్రామంలో జరిగిన పెళ్లి విందులో పెట్టిన స్వీట్లు తిన్న తర్వాత ఆ గ్రామానికి చెందిన 105 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంట్లో చిన్నారులు కూడా ఉన్నారు. వారంతా వాంతులు చేసుకున్నారు. కడుపు నొప్పితో బాధపడుతున్నారు. ఫంక్షన్ కోసం రస్మలై తయారు చేశారు. […] The post స్వీట్లు తిని 105 మందికి తీవ్ర అస్వస్థత appeared first on Navatelangana.

కామారెడ్డి: కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని దేవునిపల్లి గ్రామంలో ఓ కారులో గ్యాస్ నింపుతుండగా ఒక్కసారిగా ట్యాంకు పేలింది. ఈ ప్రమాదంలో కారు పక్కన పార్కింగ్‌లో ఉన్న మరో రెండు కార్లు, ద్విచక్రవాహనం కాలిపోయాయి. భారీ శబ్ధంతో పేలుడు సంభవించడంతో భయాందోళనకు గురైన స్థానికులు ఒక్కసారిగా అక్కడి నుంచి పరుగులు తీశారు. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

హైదరాబాద్: తెలంగాణలో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని బిఆర్ఎస్ మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆరోపించారు. మాజీ సిఎం కెసిఆర్ పదేండ్ల పాలనలో తెలంగాణ అన్ని రంగాల్లో ప్రగతి సాధించిందని అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్ లో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. బిఆర్ఎస్ హయాంలో తెలంగాణ పోలీసులు దేశంలోనే నంబర్ వన్ అని కొనియాడారు. కానీ ఇప్పుడు తెలంగాణ పోలీసులు దేశంలోనే వెనుకంజలో ఉన్నారని విమర్శించారు. శాంతి భద్రతలను విస్మరిస్తే రాష్ట్రం అధోగతేనని, ప్రతిపక్షంలో ఉన్న వారికి రాజకీయ వేధింపులు ఉన్నాయని మండిపడ్డారు. లా అండ్ ఆర్డర్ కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రే హోం మంత్రి అని సబితా పేర్కొన్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ఏం సమీక్షలు చేస్తున్నారు? అని ప్రశ్నించారు. హోం శాఖ తప్ప అన్ని సమీక్షలు జరుగుతున్నాయని, హోంశాఖకు సంబంధించి కెసిఆర్ సంస్కరణలు తెచ్చారని తెలియజేశారు. ఎక్కడ ఏ చిన్న క్రైం జరిగినా మానిటరింగ్ చేసేలా కమాండ్ కంట్రోల్ సెంటర్ కట్టారని, హైదరాబాద్ లో 12 లక్షల సిసి కెమెరాలు ఉన్నాయని చెప్పారు. అవన్నీ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచే మానిటరింగ్ చేయొచ్చనని, కానీ ఇవాళ ఎలాంటి మాని

నవతెలంగాణ – హైదరాబాద్ : పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ బయోను మార్చడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చేతిలో ఓటమి తర్వాత ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు వచ్చిన ప్రచారాన్ని ఖండించిన కొద్ది రోజులకే ఈ మార్పు జరగడం గమనార్హం.గతంలో మమత బయోలో “తృణమూల్ కాంగ్రెస్ వ్యవస్థాపక చైర్పర్సన్. గౌరవనీయ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి” అని […] The post ‘ఎక్స్’ బయోలో మమతా బెనర్జీ కీలక మార్పు.. appeared first on Navatelangana.
నవతెలంగాణ – హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు ఆమరణ నిరాహారదీక్షను ప్రారంభించారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో ఆయన దీక్షకు దిగారు. బీసీ కులగణన చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఆయన దీక్షను ప్రారంభించారు. రాజకీయ పార్టీలకు అతీతంగా బీసీల అభ్యున్నతి జరగాలంటే, ముందుగా వారి జనాభా ఎంత ఉందో స్పష్టంగా తెలియాలని వీహెచ్ వాదిస్తున్నారు. జనగణనలో బీసీ కులాలను కూడా లెక్కించడం ద్వారానే విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో జనాభా ప్రాతిపదికన న్యాయం జరుగుతుందని […] The post నిరాహారదీక్ష ప్రారంభించిన వి హనుమంతరావు appeared first on Navatelangana.


కల్వకుర్తి: రాయచూర్-కోదాడ జాతీయ దారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం కల్వకుర్తి మండల పరిధిలోని సిబిఎం కళాశాల వద్ద కారు, ప్రైవేటు పాఠశాల బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ప్రభుత్వ వైద్యుడు విజయ్ కుమార్ (43) తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే అతడిని కల్వకుర్తి పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడికి భార్య యశ్వంత్ రాణి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. యశ్వంత్ రాణి కూడా వైద్యురాలిగా పని చేస్తున్నారు. విజయ్ కుమార్ మృతికి పలువురు వైద్యులు ప్రగాఢ సంతాపం తెలియజేశారు.

