5570 articles

బెంగాల్‌లో తొలిసారిగా శనివారం బిజెపి ప్రభుత్వం కొలువుదీరింది. ఘనమైన చరిత్ర గల కోల్‌కతా బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్‌లో బిజెపి నేత సువేందు అధికారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. అసెంబ్లీ ఎన్నికలలో విజయం తరువాత చారిత్రక రీతిలో బిజెపి ప్రభుత్వం ఏర్పడింది. స్టేడియంలో వేలాది మంది బిజెపి కార్యకర్తల సందడి, జై శ్రీరామ్ , భారత్ మాతాకీ జై నినాదాలు మిన్నంటుతూ ఉండగా ముఖ్యమంత్రిగా సువేందుతో గవర్నర్ ఆర్ ఎన్ రవి ప్రమాణం చేయించారు. దీనితో రాష్ట్రంలో 15 సంవత్సరాల తృణమూల్ పాలన ముగిసింది. కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా, బిజెపి కేంద్ర నాయకత్వం, ఎన్‌డిఎ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు , నేతలు సువిశాల వేదికపై ఆసీనులయ్యారు. ప్రధాని మోడీ వేదిక మీదికి నడుసూ వచ్చి ముందుగా అక్కడ సాష్టాంగ నమస్కారం చేశారు. చేతులు జోడించారు. రాష్ట్రంలో బిజెపికి అవకాశం ఇచ్చిన బెంగాలీలకు తన ధన్యవాదాలు తెలిపారు.బిజెపి కార్యకర్తలు పెద్ద ఎత్తున హర్షధ్వానాలు చేశారు. విభిన్న రాజకీయ శక్తుల కేంద్రీకృత బెంగాల్‌లో కాషాయ పార్టీ పట్టు సాధించి, రాజకీయ రంగు మార్చిన ఘట్టాన్ని బిజెపి చిరస్మరణీయం చేసేందుకు ఏర్పాట్లు చేసింద


రిజిస్ట్రేషన్లకు భారీగా డిమాండ్ పెరిగిన నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని అధికారులను రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆదేశించారు. రిజిస్ట్రేషన్ కోసం కార్యాలయాలకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి పొంగులేటి సూచించారు. అధిక రద్దీ ఉండే చంపాపేట, సరూర్‌నగర్, వనస్థలిపురం, గండిపేట్, మహేశ్వరం, ఫరూఖ్‌నగర్, షాద్‌నగర్, రంగారెడ్డి రూరల్, ఎల్బీనగర్, శేరిలింగంపల్లి, సంగారెడ్డి, ఘట్‌కేసర్, నల్గొండ ఆర్‌ఓ, పటాన్‌చెరు, కుత్బుల్లాపూర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు పని వేళలను 12వ తేదీ నుంచి పొడిగించాలని మంత్రి పొంగులేటి అధికారులను ఆదేశించారు. ఈ 15 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అవసరమైతే పనివేళలను మరింత పెంచడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. అదే విధంగా ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని స్లాట్ బుకింగ్‌ల సంఖ్యను కూడా పెంచాలని అధికారులను మంత్రి పొంగులేటి ఆదేశించారు. ఇతర ప్రాంతాల్లో కూడా రిజిస్ట్రేషన్ల రద్దీ పెరిగిన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను గుర్తించి, అవసరానికి

ఖమ్మం: ఈ మధ్యకాలంలో వయస్సుతో సంబంధం లేకుండా గుండెపోటుతో మరణిస్తున్న వాళ్ల సంఖ్య పెరిగిపోతుంది. అధిక ఒత్తిడి కారణంగానో.. శారీరక శ్రమ కారణంగానో చిన్న వయస్సులో ఉన్న వాళ్లు కూడా గుండెపోటు బారిన పడుతున్నారు. ఖమ్మంలోనూ ఇలాంటి విషాదకర సన్నివేశం చోటు చేసుకుంది. తోటి టీచర్లకు బ్లాక్ బోర్డుపై ఇంగ్లీష్ ట్రైనింగ్ ఇస్తుండగా ఓ టీచర్ గుండె ఆగిపోయింది. ఖమ్మంలోని మమతా రోడ్‌లో శ్రీచైతన్య ఒలింపియాడ్ క్యాంపస్‌లో ఈ విషాదకర ఘటన చోటు చేసుకుంది. గారపాటి జయరాజ్ అనే టీచర్.. అక్కడకు హాజరైన టీచర్లకు ఇంగ్లీష్ ట్రైనింగ్ క్లాసులు ఇస్తున్నారు. అలా పాఠాలు చెబుతుండగా.. జయరాజ్ కుప్పకూలిపోయాడు. తోటి టీచర్లు పరుగెత్తుకుని వచ్చి ఏమైందో తెలుసుకునే లోపే నష్టం జరిగిపోయింది. దీంతో అక్కడ విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ విషాదకర ఘటనపై సహచర టీచర్లు సంతాపం వ్యక్తం చేశారు.













హైదరాబాద్: టాలీవుడ్‌లో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నిర్మాత కాకర్ల కృష్ణ శనివారం ఫిల్మ్‌నగర్‌లో వృద్ధాప్య సమస్యల కారణంగా కన్నుమూశారు. ఈ విషయాన్ని తెలియజేసిన నిర్మాతల మండలి కృష్ణ మృతికి సంతాపం తెలియజేసింది. ఈ విషయం తెలిసి పలువురు నిర్మాత కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. ప్రముఖ నిర్మాత విబి రాజేంద్ర ప్రసాద్ ‘జగపతి’ సంస్థలో ప్రొడక్షన్ మేనేజర్‌గా కృష్ణ.. ఎన్నో సూపర్‌హిట్ సినిమాలకు పని చేశారు. ఆ అనుభవంతోనే 1974లో కృష్ణ, అంజలీ దేవి నటించిన ‘ఇంటింటి కథ’ చిత్రంతో నిర్మాతగా మారారు. ఆ తర్వాత ఏడంస్తుల మేడ, ఊరంత సంక్రాంతి, రాగదీపం తదితర సినిమాలు నిర్మించారు.




అమరావతి: అభివృద్ధితో కూటమి ప్రభుత్వ పాలన మొదలైందని ఎపి మంత్రి బిసి జనార్థన్ రెడ్డి తెలిపారు. విధ్వంసంతో మాజీ సిఎం వైసిపి జగన్ మోహన్ రెడ్డి పాలన మొదలైందని అన్నారు. ప్రొద్దుటూరు లోని కొర్రపాడు రోడ్డు విస్తరణకు మంత్రి జనార్దన్ శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డితో కలిసి రూ. 5 కోట్ల పనులకు శిలాఫలకం జనార్థన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైసిపి పాలనలో రోడ్లన్నీ గుంతలమయమేనని, 9 నెలల్లోనే రూ. 1,080 కోట్లతో గుంతల్లేని రాష్ట్రంగా మార్చామని తెలియజేశారు. ఆర్ అండ్ బి శాఖను జగన్ నిర్వీర్యం చేశారని జనార్థన్ విమర్శించారు.


నవతెలంగాణ – హైదరాబాద్: తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు అంశంపై మాజీమంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ అంటేనే కరప్షన్‌కు మరో పేరని ఆయన ఆరోపించారు. తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుపై ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని మండిపడ్డారు. తుమ్మిడిహెట్టి వద్ద రూ.11 వేల కోట్ల పనులు జరిగాయని సీఎం రేవంత్ రెడ్డి చెబుతుండటం పూర్తిగా అవాస్తవమని హరీష్ రావు విమర్శించారు. మరోవైపు ప్రాజెక్టుపై ఒప్పందం కుదిరిందని మంత్రులు చెబుతుండగా.. సీఎం మాత్రం […] The post తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు: హరీష్ రావు appeared first on Navatelangana.