5570 articles

ఐపిఎల్ 2026లో భాగంగా సవాయ్ మాన్‌సింగ్ స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ ఎంచుకుంది. టాస్ బ్యాటింగ్ కు దిగిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది.118 పరుగుల వద్ద గుజరాత్ టైటాన్స్ తొలి వికెట్ కోల్పోయింది.యశ్ రాజ్ బౌలింగ్ లో సాయి సుదర్శన్ (55: 36 బంతుల్లో 6ఫోర్లు, 2 సిక్స్ లు) జోఫ్రా ఆర్చర్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 16.2 ఓవర్ లో బ్రిజేశ్ శర్మ బౌలింగ్ లో శుభమన్ గిల్ (84: 44 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్ లు) తుషార్ దేశ్ పాండేకు క్యాచ్ ఔటయ్యాడు. వాషింగ్టన్ సుందర్ 37, రాహుల్ తె వాతియా 14 నాటౌట్ గా నిలిచారు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో బ్రిజేశ్ శర్మ 2, యశ్ రాజ్ పుంజా, రవీంద్ర జడేజా తలో వికెట్ తీశారు.



నడుస్తున్న కార్ లో ఒక్కసారిగా మంటలు రావడంతో కార్ పూర్తిగా దగ్ధం అయింది. ఈ సంఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ సమీపంలో శనివారం సాయంత్రం చోటుచేకుంది. పోలీసుల వివరాల ప్రకారం మోయిజ్ (28) శ్రీరాం నగర్ లో నివాసముంటున్నాడు. శనివారం బంజారాహిల్స్ నుండి వాసెల్లా మెడోస్ వైపు వెళుతుండగా, కొత్తగూడలోని ఎస్.ఎల్.ఎన్.టి సమీపంలో టిఎస్07హెచ్ కె5555 నెంబర్ గల మెర్సిడెస్ బెంజ్ ఎలక్ట్రికల్ 300 కారు లో పొగలు వచ్చాయి. వెంటనే అప్రమతమైన డ్రైవర్ వాహనాన్ని ఆపి సురక్షితంగా కిందకు దిగాడు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. కానీ కార్ పూర్తిగా దగ్ధం అయింది. ఈ మేరకు స్థానికులు అగ్నిమపాక సిబ్బంది కు సమాచారం అందించారు. వారు సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు.

ఈ సంతాప సభలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యురాలు బట్టుపల్లి అనురాధ, నిజామాబాద్ జిల్లా కార్యదర్శి ఏ.రమేష్ బాబు, పెద్ది వెంకట్రాములు, ప్రజానాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి కట్టా నర్సింహా, జక్కిడి నర్సింహా రెడ్డి, ఈర్లపల్లి ముత్యాలు, నాగటి మారన్న, ప్రజా వాగ్గేయకారులు చింతల యాదగిరి, కాకం అంజన్న, పాటల వెంకన్న, చంద్రమౌళి,అమరావతి శివ, రాము, కామ్రేడ్ నూర్జహన్ పై నివాళి గీతాలు ఆలపించారు. అనంతరం యాదాద్రి భువనగిరి జిల్లా సీపీఐ(ఎం) జిల్లా నాయకులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి, గూడూరు […] The post కామ్రేడ్ నూర్జహన్ జీవితం స్ఫూర్తిదాయకం appeared first on Navatelangana.

మంజూరైన లబ్ధిదారులు అందరూ ప్రారంభించాలి అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్నవతెలంగాణ-మిడ్జిల్ అర్హులైన నిరుపేదలకే ఇందిరమ్మ ఇండ్లు ప్రభుత్వం మంజూరు చేసిందని, ఇందిరమ్మ ఇల్లు మంజూరైన లబ్ధిదారులు వెంటనే ప్రారంభించాలని అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ చెప్పారు. శనివారం మండలంలోని లింబ్య తండాలో స ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పురోగతినీ పరిశీలించారు. ప్రతి పేదవాడు ప్రభుత్వ సహాయంతో సొంత ఇంటిని నిర్మించుకునేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇండ్లు మంజూరై ఇంకా నిర్మాణ పనులు ప్రారంభించని కొంత […] The post నిరుపేదలకే ఇందిరమ్మ ఇండ్లు appeared first on Navatelangana.

నవతెలంగాణ- ఆలేరు టౌను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా రూ.7800 కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభం కానున్నట్లు, బిజెపి యువ నాయకులు బిర్కూరి ప్రదీప్ శనివారం ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ సందర్భంగా అనేక అభివృద్ధి ప్రాజెక్టులను, కోట్ల విలువైనవి ప్రజలకు అంకితం చేస్తారని, అనంతరం పరేడ్ గ్రౌండ్స్‌లో భారీ బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగించనున్నారని పేర్కొన్నారు. ఈ సందర్శన కేవలం అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభం మాత్రమే కాదని, కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజలకు మరింత చేరువైన […] The post ప్రధాని చేతుల మీదుగా రూ.7 వేల 800 కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభం appeared first on Navatelangana.

పక్కలో కలలు వొదిలేసిఆత్రమాత్రం అంగి లాగు తొడిగిఅల్లరి కష్ణుడిని రోలుకు బంధించినట్టుకళ్ళద్దాలు చెవులకు కట్టుకునియుద్ధమేదో ఊడిపడుతున్నట్టురెండు పయ్యల గుర్రమెక్కి బయళుదేరురాచకార్యంలౌడు స్పీకర్ ఏదో మింగేసినట్టుఅంత పెద్ద నోరేసుకునిక్షణాల్లో ఇంటింటికి చేరిపోయే కరపత్రంవాడ వాడలాగణ గణ మ్రోగే వాట్సాప్ సందేశంపొద్దు పొద్దున్నే సూర్యుడు వొచ్చినట్టుగుండె దరువు మీదఅలుపెరుగని పాట ఎత్తుకుని ప్రచారంమనిషి మనిషికీ పంచిపెట్టురాజన్న ఫలహారంమైకు లేక పోయినాసభ దద్దరిల్లి పోయేలా ఉపన్యసించే వక్తలాఊరంతా అదిరిపోయే కంచు కంఠంపెద్దల కంటికి అగుపడని చిన్నోడుపై మెట్టు ఎక్కడం రానిఆకలి డొక్కల […] The post దండోరా appeared first on Navatelangana.

చిత్తూరు జిల్లాలో తోటి అనే వ్యవస్థ అనాదిగా ఉంది. ఇది కొన్ని కుటుంబాల వారికి వంశపారం పర్యంగా వస్తూ ఉంది. వారి విధులు, విధానాలు, వారు పనిచేస్తున్న గ్రామాలలో చావుల్లో పాల్గొని కాటికాపరిగా పనిచేయడం, ఆయా గ్రామాలలో పశువులు చనిపోతే తీయడం, వ్యవసాయ పనుల్లో పాల్గొనడం చేస్తుంటారు. ఈ తోటి పని మాలల్లోనే ఉంటుంది. కాబట్టి వాళ్లను మాల తోటిగా వ్యవహరిస్తారు. ఎవరైనా చనిపోయారని తెలిసిన వెంటనే అక్కడకు చేరుకోవడం, వారి బంధువులకంతా కబురు చెప్పడం, వారిచ్చే […] The post కాటి కాపరి జీవితాలపై వచ్చిన నవల appeared first on Navatelangana.

గోండ్ కతీరా (Gond Katira)) శరీర ఉష్ణోగ్రతను తగ్గించడంలో సహాయ పడుతుంది. వేసవిలో దీనివల్ల కలిగే ప్రధాన ప్రయోజనాలు ఇక్కడ ఉన్నాయి -శరీరాన్ని చల్లబరుస్తుంది: ఇది సహజమైన కూలెంట్‌గా పనిచేస్తూ, వేసవి వేడి నుండి ఉపశమనం కలిగిస్తుంది. వడదెబ్బ బారిన పడకుండా రక్షిస్తుంది.–హైడ్రేషన్: దీనిని నీటిలో నానబెట్టినప్పుడు జెల్ లాగా మారుతుంది, ఇది శరీరంలో నీటి శాతాన్ని కాపాడి డీహైడ్రేషన్‌ను నివారిస్తుంది.–జీర్ణక్రియ మెరుగుదల: గోండ్ కతీరాలో ఉండే ఫైబర్ మలబద్ధకాన్ని తగ్గిస్తుంది, కడుపును చల్లబరుస్తుంది, అసిడిటీ, కడుపు […] The post గోండ్ కతీరా… appeared first on Navatelangana.

అమ్మే మంచిదిరాఅని చెప్పిన నాన్నఅమ్మను ఒంటరి చేసిముందే వెళ్లిపోయాడుఅమ్మ పిచ్చిదిరాఅని జాలిపడ్డ నాన్నఅమ్మను నిజంగానేపిచ్చిదాన్ని చేసిముందే వెళ్లిపోయాడుఅమ్మకు పుణ్యస్త్రీత్వంబహుమతిగాలభించాలనుకున్న నాన్నఅమ్మకు వైధవ్యాన్ని కానుకిచ్చిముందే వెళ్లిపోయాడుమా అందరికీఅమ్మే ధైర్యమని చెప్పిన నాన్నమా అమ్మకు మాత్రంతనే ధైర్యమన్న సంగతి మరిచివెళ్లిపోయాడు!– చిత్తలూరి, 9133832246 The post అమ్మే ధైర్యం ! appeared first on Navatelangana.

రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని మాజీ మంత్రి, బిఆర్‌ఎస్‌ఎల్‌పి ఉపనాయకురాలు సబితా ఇంద్రారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. శాంతి భద్రతలను విస్మరిస్తే రాష్ట్రం వెనక్కి పోతుందని అన్నారు. ప్రతిపక్షాలపై వేధింపులు తప్ప ప్రభుత్వం శాంతిభద్రలపై దృష్టి పెట్టడం లేదని ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో శనివారం ఎంఎల్‌సి సురభి వాణిదేవితో కలిసి ఆమె మీడియాతో మాట్లాడారు. సిఎం హోం మంత్రి బాధ్యతలను పూర్తిగా విస్మరించారని విమర్శించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో కూర్చుని సిఎం రేవంత్ రెడ్డి హోం శాఖపై సమీక్ష చేయడం లేదని పేర్కొన్నారు. కెసిఆర్ హోం శాఖలో అనేక సంస్కరణలు తీసుకువచ్చారని తెలిపారు. దేశంలో మొదటిసారిగా మహిళల భద్రత కోసం షీ టీమ్స్ ఏర్పాటు చేశారని చెప్పారు. రాష్ట్రంలో పట్టపగలు హత్యలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ ఐపీఎస్ భార్యను హత్య చేశారని, మల్కాజిగిరి పోలీస్ కమీషనర్ అర్ధ రాత్రి గస్తీకి వెళ్తే పోకిరీలు ఎలా వేధించారో అందరికి తెలుసని అన్నారు. తెలంగాణలో క్రైమ్ రేట్ పెరిగిందని నేషనల్ క్రైమ్ రికార్డ్ చెబుతున్నాయని పేర్కొన్నారు. 2023 కంటే 2024లో 34 వేల కేసులు పెరిగాయని, రాష్ట్రంలో 18.4 శాతం క్రై

రాణి పరిమళభరితం రాగయుతంగా భావ యుక్తంగా సాగిపోయి పరిమళాలలో తేలిపోయే దానిలోమనోహరమైన మంద వికాసం సృష్టించు గాలి తరగ లునిరంతరం సాగిపోయే జీవన వ్యాఖ్యానాన్ని సరైన ప్రభావం మనోహరమైనది సూచించారుఅందాలోకించే చంద్రుని నవ్వుమనసుకు ఇంపైన చల్లని పువ్వుగా పేర్కొన్న ఈవేళ పరిమళంఅద్భుతం అమోఘం ఆనందం అనంతమైన చుక్కల మధ్య నవ్వులు వెదజల్లే మానవీయ సౌందర్యానికిఅద్భుతమైన ఆకాశ సౌందర్యం తోడైందిచంద్రుని ముఖం బిల్ల ఆకాశదేశానికి ప్రాతినిధ్యం అయిందిడా.అంజనా శ్రీ కంభం బోనగిరి కోట, 7702537453 The post రాత్రి పూసిన appeared first on Navatelangana.

ఈ విధ్వంసాన్ని నిలిపేసి, వారసత్వ సంపదను కాపాడండని కొత్త తెలంగాణ చరిత్రబృందం వినతి.800సం.ల కాకతీయులు నిర్మించిన ఈ శివాలయాన్ని కూల్చడానికి దినం పట్టకపోవచ్చు. కాని, కట్టడానికి యేండ్లు పడుతయి. ఆ ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఆవరణలో గుడి వుంటే దేనికి అడ్డంకి. అదొక వారసత్వనిర్మాణాన్ని ఉండనీయొచ్చుకదా. ఎవరిదీ పాపం? ఎందుకా గుడికి శాపం?? వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని అశోక్‌నగర్ సమీపంలో కాకతీయుల నాటి ఆలయాన్ని కూల్చివేయబడ్డది. ప్రభుత్వం నిర్మించతలపెట్టిన ఇంటిగ్రెటేడ్ స్కూల్ ఆవరణలో ఉన్న రాష్ట్ర పురావస్తుశాఖ […] The post ఈ విధ్వంసాన్ని ఆపండి,వారసత్వ సంపదను కాపాడండి appeared first on Navatelangana.

రోజు ఎన్నిసార్లు ఉదయించినాదిగులు మేఘమొక్కటీ తొలగిపోవడం లేదు!మంచి కాలాన్ని కలగనటానికిధైర్యం విలోలమవుతున్నది!అంతటా ప్రజాస్వామ్యం ఓ మేలిముసుగేహొభూగోళమంతా నియంతత్వమే!కన్నెత్తి చూడలేముహొపన్నెత్తి మాట్లాడలేము!నువ్వూ నేనూ చేస్తున్న యుద్ధాలన్నీజానెడు పొట్ట పోసుకోవడానికే!వాళ్ళెందుకు యుద్ధాలు చేస్తున్నారు?!మనకెవరికీ అర్థం కాని ప్రశ్న!కొట్టుక చస్తున్నది వాళ్లు కదాహొదుఖం మననెందుకు చుట్టుముడుతున్నది?బడి ఆసుపత్రి విమానాశ్రయాలు కూల్చేసిహొవిజయ ప్రకటనలా ఎంత అమానుషం?సహజ సంపదలని సర్వనాశనం చేశాకహొభూమ్మీద మనిషినెవడైనా మొలిపిస్తాడా?ఆధిపత్యాంహంకారం జడలు విప్పిన చోటహొహొప్రళయాలకు ద్వారాలు తెరుచుకుంటాయి!ఇక్కడే కాదు విశ్వవీధులన్నీచైతన్యాలను పాతిపెట్టినయి!అంతులేని రాజకీయ లాలసత్వంహొమనిషికిహొ సమాధులు తవ్వుతున్నది!!– కోట్ల వెంకటేశ్వర […] The post దిగులు పద్యం! appeared first on Navatelangana.



స్విమ్మింగ్ ఫూల్‌లో ఈత కోడుదామని ప్రమాద వశాత్తు దూకి ఓ యువతి మృతి చెందిన సంఘటన అమెరికాలో చోటు చేసుకుంది. ఎల్బీనగర్ నియోజకవర్గంలో లింగోజిగూడ డివిజన్ న్యూశివపురి కాలనీలో నివాసం ఉండే దేవేందర్‌రెడ్డి ,సునీతా దంపతులు కూమారై వీణ(28) అమెరికా వర్జీనియాలో నివాసం ఉంటుంది. వీణ ఓక విందు నిమిత్తం రెండు రోజుల క్రితం ఫ్లోరిడాకు వెళ్లింది, అక్కడ స్విమ్మింగ్ ఫూల్‌లో జరిగిన ఘటనలో యువతి మృతి చెందింది. ఈ విషయం తెలుసుకున్న ఎల్బీనగర్ ఎంఎల్ఎ దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి వారి నివాసానికి తరలివెళి ,వీణ తల్లి దండ్రులకు ధైర్యం చెప్పారు. ఈసంధర్బంగా ఎంఎల్ఎ మాట్లాడుతూ.... వీణ బౌతిక కాయాన్ని త్వరలో ఇండియాకు రప్పించేందుకు తన వంతు సహాయ సహాకారాలు అందజేస్తానని తెలిపారు. మాజీ కార్పోరేటర్ వీణ కుటుంబ సభ్యులను పరామర్శించి ,ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో మాట్లాడి వీణ బౌతిక కాయాన్ని నగరానికి తెప్పించేందుకు సహాయ సహకారాలు అందజేస్తానని తెలిపారు.


శ్రీలంకలో 11 ఏళ్ల బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఆరోపణలపై 71 ఏళ్ల సీనియర్ బౌద్ధ సన్యాసి పల్లెగమ హేమరత్నను పోలీసులు అరెస్టు చేశారు. లైంగిక వేధింపుల కేసులో బౌద్ధ సన్యాసి అరెస్టు కావడం సంచలనం కలిగించింది. అనురాధపుర లోని ప్రముఖ ఆలయ ప్రధాన పూజారి అయిన ఆయనను అనురాధపుర మెజిస్ట్రేట్ కోర్టు అరెస్టు వారంట్ జారీ చేయడంతో శుక్రవారం రాత్రి అదుపు లోకి తీసుకున్నారు. నిందితుడికి సహకరించినందుకు బాధితురాలి తల్లిని కూడా అరెస్టు చేశారు. బాధితురాలి వయసు ఇప్పుడు 15 సంవత్సరాలు. అనురాధపుర ఆలయ ఆవరణలో బాలికపై లైంగిక వేధింపులు జరిగాయని పోలీస్ అధికార ప్రతినిధి ఎఫ్‌టి వూట్లర్ విలేకరులకు చెప్పారు. ఈ సంఘటనపై గత మార్చిలో ఫిర్యాదు నమోదైంది. ఇది మొదట ఒక చిన్నారి అపహరణ, నిర్బంధానికి సంబంధించిన కేసు అని డైలీ మిర్రర్ మీడియా పోర్ట్లల్ నివేదించింది. దీనిపై దర్యాప్తు ప్రారంభించేసరికి మరిన్ని వివరాలు బయటపడ్డాయి. అనురాధపుర కు 200 కిమీ దూరంలో రాజధాని కొలంబోలో ప్రైవేట్ ఆస్పత్రి ఎమర్జెన్సీ యూనిట్‌లో నిందితుడు చికిత్స పొందుతుండగా ఈ అరెస్టు జరిగింది. ఆయన తల్లిని కూడా అరెస్టు చేశారు. ప్రాచీన నగరమైన అనురాధపుర లో పవిత్ర క్షేత

బావిలో పడిన లేగదూడను కాపాడే ప్రయత్నంలో తండ్రీకొడుకులు మృతి చెందిన విషాద ఘటన ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం కర్లపల్లిలో శనివారం నాడు చోటుచేసుకుంది.బావిలో పడిన లేగ దూడను కాపాడేందుకు వెళ్లిన పవన్ కు ఊపిరాడక నీటమునిగాడు అది గమనించిన తండ్రి కోడుకును కాపాడేందుకు బావిలోకి దూకాడు. ఈ క్రమంలో తండ్రి కూడా నీట మునిగి చనిపోయాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు గజ ఈతగాళ్ల సహాయంతో మృతదేహాలను బయటకు తీసుకొచ్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాలను స్థానిక ఆసుపత్రికి తరలించారు.తండ్రికొడుకులు మృతి చెందడంతో ఆ గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి.

