ఏపీలో 2027 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేందుకు అన్ని సమస్యలను పరిష్కరించి సహకరించాలని ఏపీ సీఎం ఎన్. చంద్రబాబు నాయుడు... సెంట్రల్ మినిస్టర్ సీ.ఆర్. పాటిల్ ను కోరారు.

న్యూఢిల్లీ సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ తాను ఇప్పటికే ఐదు సార్లు ప్రాజెక్టును సందర్శించానని, తొలి దశలో 41.15 మీటర్ల వరకు నీటి నిల్వ సామర్థ్యంతో రిజర్వాయర్ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. 2026 ఏప్రిల్ 2 నాటికి కొత్త డయాఫ్రామ్ వాల్ పనులు పూర్తయ్యాయని, Gap-1 మరియు Gap-2 పనులు వేగంగా కొనసాగుతున్నాయని చెప్పారు.

ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లో ప్రజాభిప్రాయ సేకరణ పెండింగ్ కారణంగా 2011లో జారీ చేసిన స్టాప్ వర్క్ ఆర్డర్లను ఉపసంహరించుకోవాలని సీఎం కోరారు. అలాగే కాలువల విస్తరణ, హర్ ఖేత్ కో పానీ పథకం నిధులు, అల్మట్టి డ్యామ్ ఎత్తు పెంపు, అప్పర్ కృష్ణ ప్రాజెక్ట్ ఫేజ్-III అంశాలపై కూడా చర్చించారు.