TTTTటుడేతెలుగుUSA నుంచి ప్రపంచ తెలుగు సమాజానికి
Advertisement
Todayతెలంగాణ

తెలంగాణ

19393 వార్తలు

తుదితీర్పునకు లోబడే ముఫకంజా కాలేజీ అడ్మిషన్లు
తెలంగాణ

తుదితీర్పునకు లోబడే ముఫకంజా కాలేజీ అడ్మిషన్లు

ఏఐసీటీఈ అప్పీలుపై హైకోర్టునవతెలంగాణ -హైదరాబాద్‌సుల్తాన్ ఉలూం ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలోని ముఫకంజా ఇంజినీరింగ్ కాలేజీలో సింగిల్ జడ్జి మధ్యంతర ఉత్తర్వుల ఆధారంగా జరిగిన అడ్మిషన్లు తుది తీర్పునకు లోబడి ఉంటాయని హైకోర్టు స్పష్టం చేసింది. అనుమతులకు సంబంధించిన ప్రధాన రిట్ పిటిషన్‌ను వీలైనంత త్వరగా విచారించి పరిష్కరించాలని సింగిల్ జడ్జికి సూచించింది. కౌన్సెలింగ్‌కు అనుమతించకపోవడాన్ని సవాలు చేస్తూ కాలేజీ దాఖలు చేసిన పిటిషన్‌పై సింగిల్ జడ్జి కౌన్సెలింగ్‌లో పాల్గొనేందుకు అనుమతిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. వాటిని […] The post తుదితీర్పునకు లోబడే ముఫకంజా కాలేజీ అడ్మిషన్లు appeared first on Navatelangana.

Admin13 గంటల క్రితం👁 8
రీల్స్‌‌లో మోడీ బిజీ.. ముఖం చాటేస్తున్న షా
తెలంగాణ

రీల్స్‌‌లో మోడీ బిజీ.. ముఖం చాటేస్తున్న షా

ఢిల్లీ నిరసనల్లో పోలీసు చర్యపై రెండు వారాలైనా స్పందించని కేంద్రంపార్లమెంటు సమావేశాలకు డుమ్మాఅమిత్‌ ‌షా రావాలంటూ ప్రతిపక్షం పట్టు పార్లమెంటు ఉభయసభల్లో వరుస ఆందోళనలువాటిమధ్యే కీలక బిల్లుల ఆమోదం మోడీ సర్కారు తీరుపై సర్వత్రా విమర్శలు న్యూఢిల్లీ : కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తన బాధ్యతను విస్మరించింది. ప్రజాస్వామ్య దేశానికి కీలకమైన పార్లమెంటుతో సంబంధం లేనట్టుగా వ్యవహరిస్తోంది. ‘హలో ఫ్రెండ్స్‌’ అంటూ ప్రధాని మోడీ రీల్స్‌‌లో బిజీగా ఉంటున్నారు. ఇక ఢిల్లీలో గతనెల 20న జరిగిన ‘పార్లమెంట్‌ […] The post రీల్స్‌‌లో మోడీ బిజీ.. ముఖం చాటేస్తున్న షా appeared first on Navatelangana.

పీఆర్సీ ప్రకటించాలి
10న చలో రాజ్‌‌భవన్‌
తెలంగాణ

10న చలో రాజ్‌‌భవన్‌

జైల్‌‌భరోకు సన్నద్ధం కండి..జిల్లా, మున్సిపల్‌, మండల కేంద్రాల్లో నిరసనలుసంపద సృష్టికర్తల కష్టానికి విలువ లేదా?పోరాడి సాధించుకున్న చట్టాలను నిర్వీర్యం చేస్తే ఊరుకోంక్విట్‌ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో పోరాటాలకు శ్రీకారంకేంద్ర, రాష్ట్ర కార్మిక సంఘాల రౌండ్‌ ‌టేబుల్ లో వక్తలు నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌క్విట్‌ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ఈ నెల 10న నిర్వహించ తలపెట్టిన జైల్‌ ‌భరో కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కేంద్ర రాష్ట్ర కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. అదే రోజు ‌నిర్వహించతలపెట్టిన ‘చలో లోక్‌‌భవన్‌’ కార్యక్రమానికి పెద్ద […] The post 10న చలో రాజ్‌‌భవన్‌ appeared first on Navatelangana.

‘ఆయుష్’లో నిరవధిక సమ్మె
తెలంగాణ

‘ఆయుష్’లో నిరవధిక సమ్మె

నవతెలంగాణ-ఉప్పల్​స్టైఫండ్ పెంచాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ ఆయుష్ వైద్య కళాశాలలు, అనుబంధ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న హౌస్ సర్జన్లు, పీజీ విద్యార్థులు మంగళవారం నుంచి నిరవధిక సమ్మె ప్రారంభించారు. అందులో భాగంగా తెలంగాణ ఆయుష్ హౌస్ సర్జన్స్–పోస్ట్ గ్రాడ్యుయేట్స్ జేఏసీ ఆధ్వర్యంలో మేడ్చల్‌ ‌మల్కాజిగిరి జిల్లా రామంతపూర్‌లోని జేఎస్‌పీఎస్ ప్రభుత్వ హోమియోపతి మెడికల్ కాలేజ్ అండ్ ఆస్పత్రి వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. “స్టైఫండ్ పెంచాలి”, “వివక్ష వీడాలి”, “న్యాయం చేయాలి” అంటూ నినాదాలు చేశారు. […] The post ‘ఆయుష్’లో నిరవధిక సమ్మె appeared first on Navatelangana.

పారదర్శకంగా 
పోలీస్ ఉద్యోగ నియామకాలు
తెలంగాణ

పారదర్శకంగా 
పోలీస్ ఉద్యోగ నియామకాలు

పరీక్షల నిర్వహణపై ప్రత్యేక నిఘాఅధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌పోలీస్ ఉద్యోగ నియామకాల భర్తీ ప్రక్రియలో ఎలాంటి అవినీతి, అక్రమాలకు తావులేకుండా పారదర్శకంగా నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. 7,437 పోస్టుల భర్తీ ప్రక్రియకు ఎలాగైనా భంగం కలిగించాలని కొన్ని రాజకీయ పార్టీలతో పాటు ఇతర శక్తులు ప్రయత్నిస్తున్నట్లు నిఘా వర్గాలు సీఎం దృష్టికి తీసుకెళ్లాయి. ఈ నేపథ్యంలో డీజీపీ సీవీ ఆనంద్ తో పాటు ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి […] The post పారదర్శకంగా పోలీస్ ఉద్యోగ నియామకాలు appeared first on Navatelangana.

కష్టాల్లో డ్రైవర్ కం ఓనర్లు
తెలంగాణ

కష్టాల్లో డ్రైవర్ కం ఓనర్లు

రూ.65 నుంచి రూ. 103.82కు పెరిగిన డీజిల్‌ ‌ధరతొమ్మిదేండ్లైనా రూ.34వేల కిరాయేజీఎస్టీ, ఇన్సూరెన్స్‌, డ్రైవర్‌ ‌వేతనం, డీజిల్‌ అంతా ఓనర్‌‌దే…ఆర్థిక మంత్రి, ఉన్నతాధికారులకు చేసిన విజ్ఞప్తులకు స్పందనేది?ఆందోళనలో అద్దె కార్ల డ్రైవర్లునవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌రాష్ర్ట ప్రభుత్వ కార్యాలయాలు, కార్పొరేషన్లు, మున్సిపల్‌ కార్పొరేషన్లు, మున్సిపాల్టీల్లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న ఉన్నతాధికారుల కోసం ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం ఆన్‌ఎంప్లాయిమెంట్‌ ‌స్కీమ్‌ ‘డ్రైవర్‌ కం ఓనర్‌’ విధానాన్ని (1996) మూడు దశాబ్దాల క్రితం ప్రవేశ పెట్టింది. ఉన్నతాధికారుల కార్ల సౌకర్యం నుంచి తప్పించుకునేందుకు ఈ […] The post కష్టాల్లో డ్రైవర్ కం ఓనర్లు appeared first on Navatelangana.

విద్యార్థినులకు పైలట్ శిక్షణ
తెలంగాణ

విద్యార్థినులకు పైలట్ శిక్షణ

భారత్ కేర్స్ తో ఇంటర్మీడియట్ బోర్డు ఒప్పందంనవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్ఆర్థికంగా వెనుకబడిన వర్గాల విద్యార్థినీలకు పైలట్ శిక్షణ అవకాశాలను కల్పించేందుకు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్, భారత్ కేర్స్ తో అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా “గివింగ్ వింగ్స్ టు ఫ్లై” కార్యక్రమం ద్వారా పైలట్ శిక్షణ అవకాశాలు లభించనున్నాయి. ఈ కార్యక్రమంలో విద్యార్థినీలకు కమర్షియల్ పైలట్ లైసెన్స్ ట్రైనింగ్ తో పాటు ఏటీఆర్ టైప్ రేటింగ్, వసతి, భోజనం, వైద్య బీమా, మెంటార్‌షిప్, […] The post విద్యార్థినులకు పైలట్ శిక్షణ appeared first on Navatelangana.

చివరి దశకు సర్‌
సింగరేణి రక్షణకు సమగ్ర ప్రణాళికలుండాలి
తెలంగాణ

సింగరేణి రక్షణకు సమగ్ర ప్రణాళికలుండాలి

40 వేల మంది కాంట్రాక్టు కార్మికులను క్రమబద్ధీకరించాలిఆర్టీసీ విలీనం హామీని నిలబెట్టుకోవాలితుమ్మిడి హెట్టి ప్రాజెక్టును పూర్తిచేయాలిఅసెంబ్లీ సమావేశాలను పదిరోజులు నిర్వహించాలి : సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావునవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌రాష్ట్రానికి గుండె కాయలాంటి సింగరేణిని కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం, యాజమాన్యం కలిసి సమగ్ర ప్రణాళికలను రూపొందించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే, సింగరేణి కాలరీస్‌ వర్కర్స్‌ యూనియన్‌ (ఏఐటీయూసీ) గౌరవాధ్యక్షులు కూనంనేని సాంబశివరావు డిమాండ్‌ చేశారు. మంగళవారం సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తమ […] The post సింగరేణి రక్షణకు సమగ్ర ప్రణాళికలుండాలి appeared first on Navatelangana.

బుధవారం రాశి ఫలాలు (05/08/2026) వృత్తి వ్యాపారాలలో శ్రమకు తగిన లాభాలు..?
తెలంగాణ

బుధవారం రాశి ఫలాలు (05/08/2026) వృత్తి వ్యాపారాలలో శ్రమకు తగిన లాభాలు..?

మేషంఇతరుల వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. వృత్తి వ్యాపారాలలో స్థిరమైన లాభాలు అందుకుంటారు. ఉద్యోగ విషయంలో అధికారులతో చర్చలు ఫలిస్తాయి. ఆర్థిక పరిస్థితి కొంత వరకు అనుకూలిస్తుంది. నిరుద్యోగులకు కష్టానికి తగిన అవకాశాలు లభిస్తాయి. వృషభం వృధా ప్రయాణాలు చేస్తారు. ఇంటా బయటా ప్రతికూల వాతావరణం ఉంటుంది. చిన్ననాటి మిత్రులతో వివాదాలు కలుగుతాయి. ఆదాయనికి మించి ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగమున ఇతరులతో మాట పడవలసి వస్తుంది. నిరుద్యోగులకు మిశ్రమ ఫలితాలుంటాయి. మిధునం దూరప్రాంత బంధువులతో శుభకార్యములకు హాజరవుతారు. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాలలో శ్రమకు తగిన లాభాలు పొందుతారు. విద్యార్థులకు నూతన అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగస్తులకు హోదాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. కర్కాటకం కీలక వ్యవహారాల్లో ఆలోచించి ముందుకు సాగడం మంచిది. సోదరులతో స్థిరాస్తి వివాదాలు తప్పవు. బంధు మిత్రులతో ఏర్పడిన వివాదాల పరిష్కారానికి ఆటంకాలు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. వాహన ప్రయాణాలలో అప్రమత్తంగా వ్యవహారించాలి. సింహం సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. కుటుంబ

కుండపోత వాన.. కామారెడ్డి అతలాకుతలం
తెలంగాణ

కుండపోత వాన.. కామారెడ్డి అతలాకుతలం

182.5 మి.మీ. వర్షపాతం.. రాష్ట్రంలోనే అత్యధికంగా నమోదు జిల్లాలో ఆరెంజ్ అలర్ట్ కొనసాగింపు పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు, పలు గ్రామాలకు తెగిన రాకపోకలుమన తెలంగాణ/ కామారెడ్డి: కుండపోత వర్షం కామారెడ్డి జిల్లాను అతలాకుతలం చేసింది. సోమవారం రాత్రి నుంచి మంగళవారం తెల్లవారుజాము వరకు ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షంతో జిల్లా మొత్తం జలమయమైంది. జిల్లావ్యాప్తంగా వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తుండగా, పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమై, ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరోవైపు రాష్ట్రంలోనే అత్యధిక వర్షపాతం కామారెడ్డి జిల్లాలో నమోదవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లాలోని కామారెడ్డి పెద్ద చెరువు అలుగు ఉధృతంగా పారుతుండగా, మాచారెడ్డి, తాడ్వాయి, దోమకొండ, భిక్కనూర్, రాజంపేట మండలాల్లోని వాగులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. తాడ్వాయి మండలం కాళోజీవాడి గ్రామ వాగు ఉధృతంగా ప్రవహించడంతో పలు గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. అనేక గ్రామీణ రహదారులపై వరద నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింద

Viral Video: ఏడు సింహాలు.. ఒక్కటే ఆవు...! తరిమి తరిమి కొట్టింది భయ్యా..!
విమానంలో తీవ్ర ప్రకంపనలు.. 15 మందికి గాయాలు
తెలంగాణ

విమానంలో తీవ్ర ప్రకంపనలు.. 15 మందికి గాయాలు

న్యూఢిల్లీ: థాయ్‌లాండ్‌లోని ఫుకెట్ నుంచి ఢిల్లీకి వస్తున్న ఎయిర్ ఇండియా విమానం మంగళవారం ఉదయం గాల్లో తీవ్ర వాయు ప్రకంపనలకు (టర్బులెన్స్) గురైంది. ఈ క్రమంలో విమానం ఒక్కసారిగా సుమారు 300 అడుగుల ఎత్తు కోల్పోవడంతో అందులో ప్రయాణిస్తున్న కనీసం 15 మంది గాయపడ్డారు. వీరిలో ఒక కేబిన్ సిబ్బంది తీవ్రంగా గాయపడినట్లు అధికారులు తెలిపారు.ఫుకెట్ నుంచి ఎఐ-2379 విమానంగా నడిచిన ఎయిర్ ఇండియా ఏ320 విమానం ఉదయం సుమారు 11.30 గంటలకు ఢిల్లీ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయింది. విమానంలో 134 మంది ప్రయాణికులు, ఎనిమిది మంది సిబ్బంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) దర్యాప్తు ప్రారంభించింది. ప్రాథమిక సమాచారం ప్రకారం 11 మంది ప్రయాణికులు, నలుగురు కేబిన్ సిబ్బంది సహా మొత్తం 15 మంది గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం వివిధ ఆసుపత్రులకు తరలించారు. డీజీసీఏ సీనియర్ అధికారి తెలిపిన వివరాల ప్రకారం, ప్రయాణ మధ్యలో విమానం సుమారు 300 అడుగుల ఎత్తు ఒక్కసారిగా కోల్పోవడంతో ఒక కేబిన్ సిబ్బంది తీవ్రంగా, మరో కేబిన్ సిబ్బంది స్వల్పంగా గాయపడ్డారు. కొంతమంది ప్రయాణికులకూ స్వల్ప గాయాలయ

విషాదం.. 'ఛత్రపతి' విలన్ ప్రదీప్ రావత్ మృతి
తెలంగాణ

విషాదం.. 'ఛత్రపతి' విలన్ ప్రదీప్ రావత్ మృతి

సినీ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. 'ఛత్రపతి' ఫేం ప్రదీప్ రావత్(74) గుండెపోటుతో కన్నుమూశారు. మంగళవారం సాయంత్రం ఆయనకు గుండెపోటు రావడంతో ముంబైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అయితే, బ్లడ్ క్లాట్ అవడంతో చికిత్స పొందుతూ ప్రదీప్ రావత్ మరణించినట్లు తెలుస్తోంది. ఆయన మృతిపట్ల సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. విలన్ పాత్రల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ప్రదీప్ రావత్. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'సై', 'ఛత్రపతి' సినిమాతో విలన్ గా నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ప్రదీప్ రావత్, దక్షిణాదిలో 70 సినిమాలకు పైగా నటించారు. ఇక, తెలుగులో ఆయన చివరిగా 'గాయపడ్డ సింహం' అనే సినిమాలో నటించారు.

బిజెపిని పవర్ లోకి తీసుకురావడమే లక్ష్యం: రాంచందర్ రావు
తెలంగాణ

బిజెపిని పవర్ లోకి తీసుకురావడమే లక్ష్యం: రాంచందర్ రావు

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో బిజెపిని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పనిచేస్తున్నాయని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు అన్నారు. అమెరికాలోని న్యూజెర్సీ రాయల్ అల్బర్ట్ హాల్లో ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బిజెపి(యూఎస్‌ఏ ఆఫ్ బిజెపి) ఆధ్వరంలో నిర్వహించిన ‘మీట్ అండ్ గ్రీట్’ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రవాస భారతీయులను ఉద్ధేశించి మాట్లాడుతూ.. భారతదేశం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కీలక శక్తిగా ఎదిగిందని, మౌలిక సదుపాయాల కల్పనలో అపూర్యమైన పురోగతి సాధించిందని, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 75 విమానాశ్రయాలు ఉండగా, ఎన్డీఏ పాలనలో వాటిని 150కు పెంచి ప్రపంచస్థాయి మౌలిక వసతులతో అభివృద్ధి చేసింద న్నారు. రానున్న జీహెచ్‌ఎంసీ, శాసనసభ ఎన్నికల్లో బిజెపి విజయం సాధించి తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఆయన ధీమా వ్యక్తంచేశారు. బిఆర్‌ఎస్ పదేళ్ల పాలన రాష్ట్ర అభివృద్ధిని దెబ్బతీసిందని ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రజల ఆశలను నెరవేర్చడంలో విఫలమైందని ఆయన విమర్శించారు. ఈ రెండు పార్టీల పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉందని ఆయన పేర్కొన్నారు. కేంద్రంలో ప్రధా

సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం.. ప్రముఖ నటుడు ప్రదీప్ రావత్ మృతి
ఈ 20కు వ్యతిరేకంగా ఆప్ పోరాటం: కేజ్రీవాల్
తెలంగాణ

ఈ 20కు వ్యతిరేకంగా ఆప్ పోరాటం: కేజ్రీవాల్

న్యూఢిల్లీ: ఈ 20 ఇంధన విధానానికి వ్యతిరేకంగా తమ ఆందోళనను మరింత ఉద్ధృతం చేస్తామని, దీని అమలును ఆపాలంటే భారీ సంఖ్యలో ప్రజలు రోడ్ల పైకి వచ్చి పోరాడాలని ఆప్ ఆద్మీ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్ పిలుపునిచ్చారు. ఈ 20 ఇంధన విధానానికి వ్యతిరేకంగా సేకరించిన దాదాపు 2.30 లక్షల వినతి పత్రాలతో మంగళవారం ప్రధాని మోడీ నివాసం వైపు మార్చ్‌గా బయలుదేరిన తరువాత పాత్రికేయులతో ఆయన మాట్లాడారు. ఢిల్లీ పోలీసులు అడ్డుకోవడంతో ఫిరోజ్ షా రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ20 ఇంధనం వద్దనుకుంటే భారీ ఎత్తున ప్రజలు వీధుల్లోకి వచ్చి పోరాడాలన్నారు. గోవా, గుజరాత్ రాష్ట్రాల్లో ఉన్న తమ ఎమ్‌ఎల్‌ఎలు ఈ 20 విధానాన్ని ప్రశ్నిస్తారని కేజ్రీవాల్ చెప్పారు. ఆప్ ఎంపి సంజయ్ సింగ్ మాట్లాడుతూ.. పార్లమెంట్‌లో ఈ విధానాన్ని ప్రస్తావించగా అమలు చేస్తామని కేంద్రం వెల్లడించిందన్నారు. ఈ విధానం భారత రైతులకు కాకుండా అమెరికా రైతులకే ఎక్కువగా లాభం చేకూరుతుందన్నారు. ప్రధాని మోడీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒత్తిడికి నిలదొక్కుకుని అమెరికా నుంచి ఇథనాల్ దిగుమతులు నిలిపివేసి భారత రైతుల ప్రయోజనాలను కాపాడాలని విజ్ఞప్తి చేశారు.

Bigg Boss Tanuja: బిగ్‌బాస్‌ తనూజ కొత్త వెబ్ సిరీస్ 'పార్ట్ టైమర్స్'... ఆగస్టు 28 నుంచి స్ట్రీమింగ్ ఎక్కడంటే?
సెంగిపట్టి పోలీస్ స్టేషన్ నుంచి ఉదయనిధి స్టాలిన్ విడుదల.. డీఎంకే కార్యకర్తల సంబరాలు
తుగ్లక్ కేసీఆర్ వల్ల సింగరేణి సంస్థ ఆగమైంది: మంత్రి వివేక్ వెంకటస్వామి
వాషింగ్టన్‌లో విస్తరిస్తున్న కార్చిచ్చు.. అత్యవసర పరిస్థితి విధింపు
తెలంగాణ

వాషింగ్టన్‌లో విస్తరిస్తున్న కార్చిచ్చు.. అత్యవసర పరిస్థితి విధింపు

వాషింగ్టన్: వాషింగ్టన్ రాష్ట్ర పరిధిలోని అటవీ ప్రాంతాన్ని కార్చిచ్చు దహించి వేస్తుండగా, సమీపం లోని వేల మంది ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తాజాగా మరో 60 వేల మందిని తాత్కాలిక శిబిరాలకు పంపారు. మంటలకు కారణమని భావిస్తున్న స్పోకేన్‌కు చెందిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం వాషింగ్టన్ వ్యాప్తంగా 16 ప్రదేశాల్లో కార్చిచ్చు వ్యాపించింది. వందల భవనాలు అగ్నకి ఆహుతయ్యాయి. స్పోకేన్ ప్రాంతంలో మంటలు కొనసాగుతుండడంతో వాటిని అదుపు చేయడానికి అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. నష్టం తీవ్రతను అంచనా వేస్తున్నట్టు స్పోకేన్ మేయర్ లీసా బ్రౌన్ వెల్లడించారు.వాషింగ్టన్‌లో అత్యవసర పరిస్థితి తాజా పరిణామాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో మాట్లాడిన తర్వాత వాషింగ్టన్ రాష్ట్ర గవర్నర్ బాబ్ ఫెర్గూసన్ రాష్ట్ర వ్యాప్తంగా అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. కార్చిచ్చు వేగంగా వ్యాపిస్తుండడంతో ప్రభావిత ప్రాంతాల్లో ఇళ్లను ఖాళీ చేయిస్తున్నారు. మరోవైపు ఈ వారం ఉష్ణోగ్రతలు మళ్లీ పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మంటలు చెలరేగుతున్న ప్రాంతాల్లో డ్రోన్లు ఎగరవేయడంపై నిషేధ

డల్లాస్‌లో డిప్యూటీ సీఎం భట్టికి ఘన స్వాగతం..
తెలంగాణ

డల్లాస్‌లో డిప్యూటీ సీఎం భట్టికి ఘన స్వాగతం..

మన తెలంగాణ/హైదరాబాద్: అమెరికా పర్యటనలో ఉన్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకు డల్లాస్ నగరంలో నేడు ఘన స్వాగతం లభించింది. బాల్టిమోర్ నగరంలో గత మూడు రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగిన ‘ఆట’ మహాసభల వేడుకల్లో పాల్గొన్న ఆయన ఆ కార్యక్రమాల ముగింపు అనంతరం అక్కడి నుంచి బయలుదేరి డల్లాస్ చేరుకున్నారు. డల్లాస్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న డిప్యూటీ సీఎంకు ఎన్‌ఆర్‌ఐ టీపీసీసీ, ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ప్రతినిధులు, నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. ప్రవాస భారతీయులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఎయిర్‌పోర్టుకు చేరుకుని ఆయనకు పుష్పగుచ్ఛాలు అందించి తమ అపారమైన అభిమానాన్ని చాటుకున్నారు. కాగా డల్లాస్ నగరంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ఆయన పలు కీలక సమావేశాల్లో పాల్గొంటారు. రాష్ట్ర పారిశ్రామిక, ఆర్థిక అభివృద్ధికి ఉపకరించే విధంగా సింగరేణి అధికారుల బృందంతో కలిసి ఆయన ‘క్రిటికల్ మినరల్స్’ అంశంపై వివిధ బహుళజాతి కంపెనీల ప్రతినిధులతో విస్తృతస్థాయి చర్చలు జరపనున్నారు. అత్యాధునిక సాంకేతికత, పెట్టుబడుల ఆకర్షణ దిశగా ఈ సమావేశాలు జరగనున్నాయి

కల్తీ మసాలాల తయారీ ముఠా అరెస్టు
తెలంగాణ

కల్తీ మసాలాల తయారీ ముఠా అరెస్టు

25,300కిలోల కల్తీ మసాల దినుసులు స్వాధీనం13 ప్రాంతాల్లో హెచ్‌ఫాస్ట్ అధికారుల దాడులు ముగ్గురు నిందితుల అరెస్టు వివరాలు వెల్లడించిన నగర సిపి విసి సజ్జనార్ మనతెలంగాణ /సిటిబ్యూరోః ప్రమాదకరమైన రసాయనాలతో మసాల దినుసులు తయారు చేస్తున్న ముఠాను హెచ్‌ఫాస్ట్( ది హైదరాబాద్ ఫుడ్ అడాల్ట్రేషన్ సర్వైలెన్స్ టీం), జిహెచ్‌ఎంసి ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడి చేసి అరెస్టు చేశారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు వారి వద్ద నుంచి 25,300కిలోల వివిధ రకాల కల్తీ మసాల దినుసులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ టిజిఐసిసిసిలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. హైదరాబాద్, కాటేదాన్‌కు చెందిన రాహుల్ భాటి, బేగంబజార్‌కు చెందిన విశాల్ పన్వర్, దులిచంద్ కచ్చావార్ ప్రమాదకరమైన రసాయనాలతో మసాల దినుసులు తయారు చేస్తున్నారు. వాము, జిలకర, లవంగాలు, సాజీరా, సోంపు, ఆవాలు, జీరా డస్ట్, మెంతులు, నువ్వులు, షైనింగ్ పౌడర్, రైస్ బ్రాన్ ఆయిల్‌కు ప్రమాదకరమైన రసాయనాలు కలిపి విక్రయిస్తున్నారు. రసాయనాలతో తయారు చేసిన మసాలా దినుసులను ఎపి, తెలంగాణలోని పలువురికి విక్రయిస్తున్నారు. 13 వ