19510 వార్తలు

కొంత కాలంగా నగరాల్లోనే కాకుండా పట్టణాల్లో కూడా ఆపార్ట్ మెంట్ నాగరికత పెరిగిపోతోంది. దీనికి తోడుగా అంతస్తులు పెరిగిపోవడంతో ఎవరైనా మెట్ల ద్వారా తమ ఫ్లోర్‌కు వెళ్లే పరిస్థితులు తగ్గిపోయాయి. లిఫ్ట్‌లు పని చేయకపోతే కాలమే స్తంభించిపోతోంది. తీరిక లేకుండా లిఫ్ట్‌లు పైకి కిందికి కదలడం వల్ల వాటి జీవితకాలం కూడా తగ్గిపోతోంది. యాంత్రిక లోపాలు ఏర్పడడం, మీటలకు అనుగుణంగా కదలక అవి మొరాయించడం ఈ రోజుల్లో సర్వసాధారణమైన పోయింది. అయితే వాటిని ఎవరు తీవ్రమైన సమస్యగా పరిగణించడం లేదు. 20, 30 ఏళ్లనాటి అపార్ట్‌మెంట్‌లలో ఊగిసలాడే, గరగర శబ్దం చేసే లిఫ్ట్‌లు కదులుతూనే ఉంటాయి. వాటిని ఎక్కాలంటేనే భయమేస్తుంది. దాదాపుగా అంతటా పాత లిఫ్ట్‌లను ఏదో చిన్నపాటి మరమ్మత్తుతో నెట్టుకొస్తుంటారు. ఇలా సరైన నిర్వహణ లేనప్పుడు అవి దెబ్బ తిని పెను ప్రమాదాలకు దారి తీస్తున్నాయి. లిఫ్ట్ ప్రమాదాల వల్ల గాయపడడమే కాకుండా మరణాలు కూడా సంభవిస్తున్నాయి. లిఫ్ట్ క్యాబిన్ రాక ముందే తలుపు తెరుచుకోవడం వల్ల అందులోకి వెళ్లి కిందపడి చనిపోయిన వారున్నారు. హైదరాబాద్‌లో ఓ చోట ఆరవ అంతస్తు నుండి లిఫ్ట్ కింద పడిపోవడంతో ఒకరు చనిపోయారు. లిఫ్ట్ లోపలి వెళుతుండగానే


కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పేముందు ఆ ప్రశ్న సరైనదేనా అని అడగాలి ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రతి చర్చ ఒకే విధంగా పుట్టదు. కొన్ని చర్చలు సమాజం అవసరం వల్ల వస్తాయి. మరికొన్ని రాజకీయాల అవసరం వల్ల వస్తాయి. ఈ రెండింటి మధ్య తేడా గుర్తించకపోతే సమాధానం ఎంత సరైనదైనా అది అసలు ప్రశ్ననుంచి తప్పించుకోవచ్చు. నేడు రిజర్వేషన్లపై జరుగుతున్న చర్చ కూడా అలాంటిదే. పైకి చూస్తే అది ఒక విధానం గురించి చర్చలా కనిపిస్తుంది. కానీ కొంచెం లోతుగా చూస్తే అది భారత ప్రజాస్వామ్యం తన గురించి తాను వేసుకోవాల్సిన ఒక పెద్ద ప్రశ్నను తాకుతుంది. అదే ‘సామాజిక న్యాయం పూర్తయిందా? ఈ ప్రశ్నకు సమాధానం తెలియకుండా దాన్ని సాధించే విధానాలపై తీర్పు చెప్పడం అంటే గమ్యానికి చేరామో లేదో చూడకుండానే ప్రయాణాన్ని ఆపేయాలని నిర్ణయించడం లాంటిది. జర్మన్ తత్వవేత్త యుర్గన్ హెబెర్మాస్ ఆధునికతను ఒక అసంపూర్ణ ప్రాజెక్టు (an incomplete project) గా అభివర్ణించాడు. ఈ భావనలోని అసలు బలం ఒకే మాటలో ఉంది. అసంపూర్ణమంటే విఫలం అని కాదు. ఇంకా పూర్తి చేయాల్సిన బాధ్యత మిగిలి ఉందని అర్థం. ప్రతి అసంపూర్ణ ప్రాజెక్టుకు ముందు రెండు మార్గాలు ఉంటాయి. ఒకటి అది పూర్తి కాలేదు అని చ


హైదరాబాద్: హైడ్రా పేరుతో నకిలీ ఫైర్ ఎన్ఓసిలు బయటకు వచ్చాయి. హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకం ఫోర్జరీ చేసి ఎన్ఒసిలు సృష్టించారు. ఎనిమిది ప్రైవేట్ కాలేజీలు ఫైర్ ఎన్ ఓసిపై రంగనాథ్ సంతకం ఫోర్జరీ చేసినట్టు తెలుస్తోంది. ఇంటర్ బోర్డుకు ఎనిమిది కాలేజీలు సబ్మిట్ చేశాయి. ఎనిమిది కాలేజీలపై లేక్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నాయి. మరో 60కాలేజీల ఎన్ ఒసిలను స్క్రూటినీ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఎనిమిది కాలేజీలు గుర్తింపు రద్దు చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నట్టు సమాచారం. వివిధ సెక్షన్ల కింద 337, 336(3), 340(2), 318(4) , ఆర్/డబ్లు 3(5) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తెల్లాపూర్, చిక్కడపల్లి, ఎస్ ఆర్ నగర్, మెహదీపట్నం, బర్కత్ పురాలలో ఉన్న కాలేజీల యాజమాన్యం ఈ ఫోర్జరీకి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.










చెన్నై: ఓ వృద్ధాశ్రమం కరెంట్ బిల్లు రూ. 4.3 లక్షలు రావడంతో నిర్వహకులు షాక్‌కు గురయ్యారు. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రం శివగంగై జిల్లాలో జరిగింది. కారైక్కుడి బర్మా కాలనీలో ఓ ప్రైవేట్ స్వచ్ఛంద సంస్థ వృద్ధాశ్రమాన్ని నడుపుతోంది. నిర్వహకుల సెల్‌ఫోన్‌కు రూ.4,39,743 కరెంట్ బిల్లు రావడంతో ఒక్కసారిగా నిర్వహకులు కంగుతిన్నారు. వెంటనే వారు విద్యుత్ కార్యాలయంలో అధికారులు కలిసి వివరాలు అడిగారు. సాఫ్ట్‌వేర్ లోపంతో కరెంట్ బిల్లు ఎక్కువగా వచ్చిందని అధికారులు పేర్కొన్నారు. వృద్ధాశ్రమం బిల్లు రూ.15,205గా ఉందని విద్యుత్ అధికారులు పేర్కొన్నారు.





ది హండ్రెడ్ మెన్స్ లీగ్‌లో సన్‌రైజర్స్ లీడ్స్ బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. మంగళవారం హెడింగ్లే వేదికగా లండన్ స్పిరిట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 100 బంతుల్లోనే 241 పరుగులు చేశారు. దీంతో సన్‌రైజర్స్ 37 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కి దిగిన సన్‌రైజర్స్ జట్టుకు ఓపెనర్లు మిచెల్ మార్ష్, ర్యాన్ రికెల్టన్ శుభారంభం అందించారు. వీరిద్దరు కలిసి తొలి వికెట్‌కు 54 బంతుల్లోనే 131 పరుగులు జత చేశారు. పురుషుల హండ్రెడ్ లీగ్2లో ఇదే అత్యధిక భాగస్వామ్యం కావడం విశేషం. మార్ష్ 24 బంతుల్లో అర్థశతకం సాధించగా.. రికెల్టన్ కేవలం 21 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. అయితే మార్ష్ 37 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్సులతో 76 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. కానీ, రికెల్టన్ మాత్రం దూకుడుగా ఆడాడు. 42 బంతుల్లో 6 ఫోర్లు, 8 సిక్సులతో 94 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఫస్ట్ డౌన్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ 18 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సులతో 55 పరుగులు చేశాడు. దీంతో సన్‌రైజర్స్ నిర్ణీత 100 బంతులలో 2 వికెట్లు కోల్పోయి 241 పరుగులు చేసింది. అయితే లండన్ స్పిరిట్‌కి లక్ష్య చేధనలో ఆరంభంలోనే షాక్ తగిలింది. జానీ బెయిర్‌స్ట

నవతెలంగాణ – హైదరాబాద్ : కర్ణాటక రాష్ట్రం యాద్గిర్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కడేచూరు-బాడియాల పారిశ్రామిక వాడలోని ఓ పరిశ్రమలో ఇవాళ వేకువజామున రసాయన వాయువు లీకై ముగ్గురు కార్మికులు ఊపిరాడక మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మృతులను తెలంగాణలోని నారాయణపేట జిల్లా కృష్ణ మండలం ఆలంపల్లికి చెందిన గణేశ్‌తో పాటు మధ్యప్రదేశ్‌లోని కట్నీ జిల్లాకు చెందిన విక్రమ్, సంజయ్‌లుగా గుర్తించారు. వీరంతా 20 నుంచి 25 ఏండ్ల లోపు యువకులే. ఈ […] The post పరిశ్రమలో రసాయన వాయువు లీక్.. ఊపిరాడక ముగ్గురి మృతి appeared first on Navatelangana.

