చెన్నై: ఓ వృద్ధాశ్రమం కరెంట్ బిల్లు రూ. 4.3 లక్షలు రావడంతో నిర్వహకులు షాక్‌కు గురయ్యారు. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రం శివగంగై జిల్లాలో జరిగింది. కారైక్కుడి బర్మా కాలనీలో ఓ ప్రైవేట్ స్వచ్ఛంద సంస్థ వృద్ధాశ్రమాన్ని నడుపుతోంది. నిర్వహకుల సెల్‌ఫోన్‌కు రూ.4,39,743 కరెంట్ బిల్లు రావడంతో ఒక్కసారిగా నిర్వహకులు కంగుతిన్నారు. వెంటనే వారు విద్యుత్ కార్యాలయంలో అధికారులు కలిసి వివరాలు అడిగారు. సాఫ్ట్‌వేర్ లోపంతో కరెంట్ బిల్లు ఎక్కువగా వచ్చిందని అధికారులు పేర్కొన్నారు. వృద్ధాశ్రమం బిల్లు రూ.15,205గా ఉందని విద్యుత్ అధికారులు పేర్కొన్నారు.