యువ హీరో సందీప్ కిషన్ సరికొత్త ప్రయోగం చేసేందుకు సిద్ధమయ్యాడు. తన తదుపరి చిత్రం ఫాంటసీ అడ్వెంచర్‌గా రానున్నట్లు తెలిపారు. ఈ చిత్రం రెండు భాగాలుగా రానుంది. యుగంధర్ ముని దర్శకత్వంలో రానున్న ఈ సినిమాకు ‘కరికాల - ఎ మ్యాజికల్ వరల్డ్’ అనే టైటిల్‌ను పెట్టారు. రెండు భాగాలుగా వస్తుందని విడుదల తేదీలను తెలుపుతూ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ని విడుదల చేశారు. మొదటిభాగం 2027 జులై 2న, రెండో భాగం అక్టోబర్ 28న విడులద చేయనున్నారు. పాన్ ఇండియా స్థాయిలో దీన్ని తెరకెక్కిస్తున్నట్లు టీమ్ తెలిపింది. త్వరలోనే దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను పంచుకోనున్నారు.